Team India: ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..

IND vs AUS: భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎప్పుడు టెస్టు సిరీస్ జరిగినా.. రెండు దేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు ఇప్పటికే వచ్చేసింది. ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు టీమిండియా ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
 

  • Feb 04, 2023, 14:01 PM IST
1 /5

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేశాడు. 39 మ్యాచ్‌లలో 3630 రన్స్ బాదేశాడు. ఇందులో 11 సెంచరీలు ఉన్నాయి.   

2 /5

భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నంబర్ టు స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై 28 మ్యాచ్‌లు ఆడిన వీవీఎస్.. 6 సెంచరీలతో సహా 2434 పరుగులు చేశాడు.  

3 /5

భారత జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ను టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ది వాల్ అని పిలుచుకుంటారు. ఆస్ట్రేలియాతో జరిగిన 32 టెస్టు మ్యాచ్‌ల్లో 2143 పరుగులు చేశాడు. 

4 /5

భారత్ తరఫున ఆస్ట్రేలియాతో ఆడిన 20 మ్యాచ్‌లలో నయా వాల్ ఛెతేశ్వర్ పుజారా 1893 పరుగులు చేశాడు. ప్రస్తుతం పుజారా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.   

5 /5

టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసీస్‌పై 22 టెస్టులాడి మూడు సెంచరీలతో 1738 పరుగులు చేశాడు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్.