Rajyog: అరుదైన యోగం చేయబోతున్న శనిదేవుడు... వీరు ధనవంతులవ్వడం పక్కా..

Shash Mahapurush Rajyog: ఈ నెల చివరిలో శనిదేవుడు అస్తమించబోతున్నాడు. మళ్లీ మార్చిలో అతడు ఉదయిస్తాడు. శనిదేవుడు ఉదయం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 01:16 PM IST
Rajyog: అరుదైన యోగం చేయబోతున్న శనిదేవుడు... వీరు ధనవంతులవ్వడం పక్కా..

When shani Uday 2023: జ్యోతిషశాస్త్రంలో నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని ఒకటి. శని గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రెండున్నరేళ్ల తర్వాత శనిగ్రహం జనవరి 17న తన స్థానాన్ని మార్చుకుని కుంభరాశిలోకి ప్రవేశించింది. ఈ నెల చివరిలో అంటే జనవరి 31న కుంభరాశిలో అస్తమించనుంది. మళ్లీ శనిదేవుడు మార్చి 09న కుంభరాశిలో ఉదయించనున్నాడు. ఉదయించడం వల్ల శష మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సింహరాశి (Leo)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో శని ఉదయించడం వల్ల షష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సపోర్టు లభిస్తుంది. సింహ రాశిలో సప్తమంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 
ధనుస్సు రాశి (Sagittarius)
శనీశ్వరుడు ఉదయించడం వల్ల ఏర్పడిన రాజయోగం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క మూడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం ఎదురుచూస్తున్న వ్యక్తుల కల ఫలిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.

మిధునరాశి (Gemini)
శష్ మహాపురుష రాజయోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశికి తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 
మేషరాశి (Aries)
మేష రాశి వారు శష మహాపురుష రాజయోగం కారణంగా వృత్తి, వ్యాపారాలలో పురోగతిని పొందుతారు. ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. జాబ్ మారాలనుకునేవారికి ఈ సమయం బాగుంటుంది. వ్యాపారులు లాభపడతారు. 

Also Read: Surya Rashi Parivartan: వచ్చే నెలలో రాశిని మార్చనున్న గ్రహాల రాజు... ఈ రాశులకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News