Cholesterol: ఈ ఐదు పదార్ధాలు తీసుకుంటే..రక్తంలో పేరుకున్న కొలెస్ట్రాల్ 15 రోజుల్లో కరిగిపోతుంది

రక్త నాళికల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంది. రక్తంలో ప్లక్ పెరిగినప్పుడు రక్త నాళికల్లో పేరుకుపోతుంటుంది. ఫలితంగా బ్లాకేజ్‌లు ఏర్పడతాయి. గుండె వరకూ రక్తం సరఫరాలో ఇబ్బంది ఏర్పడటంతో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిస్ ముప్పు పెరిగిపోతుంది. ధమనుల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలో తెలుసుకుందాం..

Cholesterol: రక్త నాళికల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంది. రక్తంలో ప్లక్ పెరిగినప్పుడు రక్త నాళికల్లో పేరుకుపోతుంటుంది. ఫలితంగా బ్లాకేజ్‌లు ఏర్పడతాయి. గుండె వరకూ రక్తం సరఫరాలో ఇబ్బంది ఏర్పడటంతో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిస్ ముప్పు పెరిగిపోతుంది. ధమనుల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలో తెలుసుకుందాం..

1 /5

పసుపు వినియోగం సాధారణంగా ఆహారం రుచిని పెంచేందుకు దోహదపడుతుంది. కానీ ఇదే పసుపు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం వేడి వేడి పాలలో పసుపు వేసి తాగాలి. కొన్ని రోజుల్లోనే ఫలితాలు కన్పిస్తాయి.

2 /5

సోంపును సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. కానీ సోంపుతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చాలా తక్కువమందికి తెలుసు. దీనికోసం రోజూ రాత్రి వేళ సోంపు గ్లాసు నీళ్లలో నానబెట్టి,, ఉదయం వడకాచి తాగితే మంచి ఫలితాలుంటాయి.

3 /5

అల్లం శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం పచ్చిగా లేదా హెర్బల్ టీ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి నాళికల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

4 /5

వెల్లుల్లి వాసన చాలామందికి ఇష్టముండదు. కానీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ 2-3 వెల్లుల్లి రెమ్మలు నమిలి తింటే చాలా మంచి ఫలితాలుంటాయి. లేదా వెల్లుల్ని రెమ్మల్ని కొద్దిగా కాల్చి తింటే ఇంకా మంచిది.

5 /5

ఉసిరిలో పెద్దమొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడతాయి. దీనికోసం రోజూ 2 ఉసిరికాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.