Astro Tips for pooja mandir: ఇంట్లోని పూజా మందిరంలో ఈ చిహ్నాలుంటే..ఇక అంతా ఐశ్వర్యమే

Astro Tips for pooja mandir: ఎవరైనా దీర్ఘకాలంగా అప్పుల ఊబిలో చిక్కుకుని ఉంటే..ఇంట్లోని పూజా మందిరంలో వాస్తు ప్రకారం కొన్ని శుభ చిహ్నాలు అమర్చడం ద్వారా విముక్తి పొందవచ్చు. ఈ శుభ చిహ్నాలు ఆ వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందుల్నించి బయటపడేస్తాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2023, 10:34 PM IST
Astro Tips for pooja mandir: ఇంట్లోని పూజా మందిరంలో ఈ చిహ్నాలుంటే..ఇక అంతా ఐశ్వర్యమే

ఇంట్లోని పూజా మందిరం అందరికీ అత్యంత పవిత్రమైంది, శుభప్రదమైంది. ఇంట్లోని పూజా మందిరంలో అందరు దేవదేవతలుంటారు. నిర్ణీత రూపంలో పూజ చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజా మందిరానికి ఈశాన్య దిశ అత్యంత అనువైందిగా చెబుతారు. ఈ దిశ దేవ దేవతలది కావడం వల్ల శుభసూచకంగా భావిస్తారు.

వాస్తుశాస్త్రంలో ఇంట్లోని ఆలయంలో కొన్ని శుభ చిహ్నాలు ఉంచాలని ఉంది. ఇందులో శ్రీ, ఓమ్, స్వస్తిక్ వంటి గుర్తులు పెట్టుకోవచ్చు. ఈ గుర్తుల్ని అమర్చుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. జీవితంలో అన్ని పనులు శుభప్రదమౌతాయి. ఇంట్లోని పూజామందిరంలో ఎలాంటి శుభ చిహ్నాలు పెట్టుకోవాలో తెలుసుకుందాం..

ఇంటి పూజా మందిరంలో ఓమ్ చిహ్నంతో కలిగే ప్రయోజనాలు

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజా మందిరంలో చందనం లేదా కేసరితో ఓమ్ చిహ్నాన్ని గీయాలి. మందిరంలో ఓమ్ చిహ్నం పెట్టుకోవడం, ఆ జపం చేయడం వల్ల శక్తి, ఏకాగ్రత వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఇంట్లోని ఒత్తిడి దూరమౌతుంది. కేసరి, చందనంతో తయారైన ఓమ్ వల్ల వ్యక్తికి సామాజిక , కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలు దూరమౌతాయి. అభివృద్ధి మార్గాలు తెర్చుకుంటాయి.

స్వస్తిక్ చిహ్నంతో లాభాలు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంటి పూజా మందిరం రెండువైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం ఏర్పాటుతో లాభముంటుంది. స్వస్తిక్ చిహ్నంతో పాటు దిగువన శుభ లాభం అని రాయాలి. దీనివల్ల ఇంటి వాస్తుదోషం ఉంటే తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది. స్వస్తిక్ చిహ్నాన్ని 9 అంగుళాల పొడుగు, వెడల్పుతో ఏర్పాటు చేయాలి. ఈ చిహ్నం ఇంట్లో అశుభ ప్రభావాన్ని నియంత్రిస్తుందంటారు. లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. 

శ్రీ చిహ్నం ఏర్పాటుతో కలిగే లాభాలు

జ్యోతిష్యం ప్రకారం శ్రీ చిహ్నాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. దీనిని ఇంట్లోని పూజా స్థలంలో సింధూరం లేదా కేసరితో చేయడం వల్ల లాభముంటుంది. దీంతో వ్యక్తి జీవితంలో సుఖ సమృద్ధి లభిస్తుంది. వాస్తు ప్రకారం శ్రీ చిహ్నం ఏర్పాటుతో ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదు. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో పరస్పరం ప్రేమ పెల్లుబుకుతుంది. పూజాస్థలంపై శ్రీ చిహ్నం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కొనసాగుతుంది.

Also read: Bhadra Rajyog 2023: అరుదైన భద్ర రాజయోగం.. ఈ రాశుల వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు! వివాహం జరిగే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News