Anam Ram Narayana Reddy: ఒక్క రోడ్డు వేయలేదు, అడుగుతుంటే ఏం చెప్తాం.. పెన్షన్లకు ఓట్లా?: జగన్ ప్రభుత్వంపై ఆనం విమర్శలు

Anam Ram Narayana Reddy on YSRCP Government: గతంలో లానే ఆనం రామనారాయణ రెడ్డి సొంత వైసీపీ ప్రభుత్వం మీద మరోమారు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే     

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 30, 2022, 03:19 PM IST
Anam Ram Narayana Reddy: ఒక్క రోడ్డు వేయలేదు, అడుగుతుంటే ఏం చెప్తాం.. పెన్షన్లకు ఓట్లా?: జగన్ ప్రభుత్వంపై ఆనం విమర్శలు

Anam Ram Narayana Reddy Sensational Allegations on YSRCP Government: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీకి కొంతమంది సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. గతంలో నరసాపురం ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు ఇప్పటికే రెబల్ నేతగా మారి వైసీపీ నేతలు అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

గతంలోనే పలు సందర్భాలలో సొంత పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కామెంట్స్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద విమర్శలు వర్షం కురిపించారు. ఒక పక్క రోడ్లు వేయలేకపోతున్నామని ఆ రోడ్లకు పడిన గుంతల కూడా పూడ్చలేక పోతున్నామని ఆయన పేర్కొన్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులు ఇస్తుందని అప్పటి నుంచి నీళ్లు ఇస్తామని చెప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారు అని ప్రజలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ప్రశ్నించిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రాజెక్టులు ఏమైనా కట్టామా? అంటే అది లేదు, పనులు మొదలు పెట్టామా అంటే అదీ లేదని అన్నారు. ఇక ఎలాంటి ప్రారంభోత్సవాలు కూడా ఈ నాలుగేళ్లలో చేయలేదని పేర్కొన్న ఆయన పెన్షన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చింది కదా అప్పుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు.

పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పాము అదేవిధంగా లేఔట్లు వేశాము కానీ ఇళ్లు కట్టామా అని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఆయన మాత్రమే కాదు ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ప్రభుత్వం మీద తీవ్ర విమర్శల గుప్పించారు. సౌత్ మోపూరులో మొగిలిపాలెం వద్ద వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాలు వరకు పంట పొలాలు నీట మునిగితే అది అధికారుల వైఖరి కారణంగానే జరిగిందని ఆయన విమర్శలు చేశారు.  మంత్రులు మారినా పనులు జరగడం లేదని కూడా ఆయన మండిపడ్డారు.

బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు మేరకు పనులు ఇప్పటికీ మొదలు కాలేదని ఆయన అన్నారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి వరుసగా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్న క్రమంలో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది, తెలుగు దేశానికి వెళ్లి అక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగగా ఆయన పలు సందర్భాల్లో ఈ ప్రచారాన్ని ఖండించారు కూడా. అయితే తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

Also Read: Venuswamy on Prabhas: 2023 నుంచి దారుణంగా ప్రభాస్ పరిస్థితి.. వేణు స్వామి సంచలన కామెంట్లు!

Also Read: Sai Dharam Tej: పవన్ ను ఇమిటేట్ చేసిన తేజ్.. బాలయ్య ముందే తొడకొట్టి మరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News