Sbi Scheme: మీరు ఒకేసారి నగదు డిపాజిట్ చేసి ప్రతి నెల ఆదాయం కోసం ఎదురుచూస్తుంటే.. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో ఒకసారి పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి నెలతో వడ్డీతో కూడిన ఆదాయం పొందవచ్చు. ఎలాగో తెలుసుకోండి..
ఈ పథకం పేరు యాన్యుటీ డిపాజిట్ ప్లాన్ (SBI యాన్యుటీ డిపాజిట్ పథకం). మీరు ఇందులో ఖాతాను సింగిల్‌గా లేదా జాయింట్‌గా అయినా ఓపెన్ చేయవచ్చు. మీరు ఈ స్కీమ్ కోసం ఏదైనా శాఖ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకంలో మీరు ప్రతి నెలా నిర్ణీత తేదీన యాన్యుటీని చెల్లించాలి. మీ యాన్యుటీ ఏదైనా నెలలో 29, 30 లేదా 31వ తేదీల్లో ఉంటే.. మీరు ఈ డబ్బు వచ్చే నెల మొదటి తేదీన పొందుతారు.
ఇందులో మీరు 36, 60, 84 లేదా 120 నెలల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దీనిలో గరిష్ట డిపాజిట్ పరిమితి. కనీసం మీరు నెలకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి.
ఈ ప్రభుత్వ పథకంలో మీరు పొదుపు ఖాతా కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు. ఇందులో FD, టర్మ్ డిపాజిట్‌కి సమానమైన వడ్డీ ప్రయోజనాన్ని కస్టమర్లు పొందుతారు. మీరు ఈ స్కీమ్ కోసం ఏదైనా శాఖ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో కస్టమర్లు ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. అంతేకాకుండా వడ్డీ చక్రవడ్డీ సౌకర్యం లభిస్తుంది.