How Increase Memory Power: ఈ ఆకుల రసాన్ని తాగితే మెమోరీ పవర్‌ 30 రోజుల్లో బూస్ట్‌ అవ్వడం ఖాయం..

How Increase Memory Power: ప్రతి రోజూ ఈ ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగితే జ్ఞాపకశక్తి సులభంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Nov 22, 2022, 12:11 PM IST

Memory Power Increase: చాలామంది ప్రస్తుతం మెదడు సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. మరికొందరైతే మానసిక ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలైనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానవునికి ఏకాగ్రత జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఇవి రెండూ లేకపోతే సమాజంలో జీవించడం చాలా కష్టం. అయితే ఈ మెదడు సంబంధిత సమస్యల నుంచి ఏ విధంగా సులభంగా ఉపశమనం పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

 జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోవడానికి సరస్వతి ఆకుల రసాన్ని ప్రతి రోజూ తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర శక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

2 /5

సరస్వతి ఆకులను ముందుగా ఎండ పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని పొడి లాగా తయారు చేసుకొని.. అందులో మూడు మిరియాలను, తగినంత నీరు, తేనెను వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫిల్టర్ చేసి ఓ గాజు సీసాలో భద్రపరచుకుని ప్రతిరోజు దానిని రెండు చెంచాలు తీసుకుంటే జ్ఞాపకశక్తి ఏకాగ్రత సులభంగా పెరుగుతుంది.

3 /5

జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచేందుకు సరస్వతి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఆకులతో తయారుచేసిన రసాన్ని ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. దీనినే విధంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

4 /5

జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచుకోవడానికి చాలామంది మార్కెట్లో లభించే చాలా రకాలు ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి బదులుగా ఆయుర్వేదనకు నిపుణులు సూచించిన ఈ చిట్కాను వినియోగించండి.

5 /5

చాలామంది పుట్టుకతోనే ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపకశక్తి సమస్యలతో పుడుతూ ఉన్నారు. ఇలా జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల చదువుల్లో రాణించలేకపోతున్నారు.