Do These Simple remedies on Karthika Pournami to Get Lakshmi Devi: ప్రతి ఏడాదిలో వచ్చే 'కార్తీక మాసం' విష్ణువు, శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ముఖ్యంగా 'పౌర్ణమి' రోజు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు. అలానే కార్తీక పౌర్ణమి రోజున దేవతలు భూమిపై ఉన్న గంగానదిలో స్నానం చేస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రోజున ప్రజలు గంగానది వద్ద స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. అంతటి విశిష్టత ఉన్న కార్తీక పౌర్ణమి.. ఈ సంవత్సరం నవంబర్ 8న వచ్చింది.
కార్తీక పౌర్ణమి 2022 నవంబర్ 7న సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమయి.. మరుసటి రోజు నవంబర్ 8న సాయంత్రం 4:31 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ప్రజలందరూ శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మి దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మిదేవి ఇంటికి వస్తుందని భక్తులు నమ్ముతారు. దాంతో ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన పరిహారాల గురించి ఓసారి తెలుసుకుందాం.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రజలు ఆలయంలో విష్ణువు సమేతంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున మీ స్వహస్తాలతో పిండి దీపం చేసి.. అందులో 7 లవంగాలు వేసి ప్రధాన గుమ్మం వద్ద ఉంచండి. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. అలాగే తులసి మాత ముందు నెయ్యి దీపం వెలిగించి.. విష్ణువు మరియు లక్ష్మీ దేవిని పూజించండి.
కార్తీక పౌర్ణమి రోజున మామిడి ఆకులతో తోరణం తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారంకు కట్టండి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ తయారు చేసి పెట్టండి. ఇక శివునికి పాలు, పెరుగు మరియు గంగాజలంతో అభిషేకం చేయడం చాలా శుభప్రదం. దీని వల్ల లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంటికి వస్తుంది.
Also Read: IND vs ENG: సెమీస్ ముందు టీమిండియాకు శుభవార్త.. సగం మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన!
Also Read: సూర్యకుమార్ యాదవ్ ఆస్తులు, భార్య వివరాలు ఇవే! మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న పని చేస్తే.. వద్దన్నా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది!
కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న పని చేస్తే
వద్దన్నా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది
స్వహస్తాలతో పిండి దీపం చేసి