Allu Arjun Encouraging his Maternal Cousin Viran Muttamsetty: అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బాధ్యతలు తలకెత్తుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన అనేక సినిమాలు నిర్మించి మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ క్రేజ్ తీసుకురావడమే గాక తాను కూడా నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య మంచి సంబంధం బాంధవ్యాలు ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినా సరే అల్లు అరవింద్ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండేవారు. తర్వాత పార్టీ ఎత్తివేయడం, మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రావడంతో ఈ కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందని ప్రచారం అయితే చాలా కాలం నుంచి జరుగుతోంది.
దానికి కారణం మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించడమే. మామూలుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ సొంతంగా ఎలా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడం అనేది అల్లు కాంపౌండ్ వారికి పెద్దగా రచించలేదని వాదన ఉంది. దానికి తోడు అల్లు అర్జున్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను చెప్పను బ్రదర్ అంటూ హర్ట్ చేయడం ఆ తర్వాత కొన్ని సందర్భాలలో మెగాస్టార్ చరిష్మా కాకుండా తమకు సొంత చరిష్మా ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లుగా అభిమానులు కామెంట్ చేస్తూ ఉంటారు.
ఆ మధ్యకాలంలో మెగా అభిమానులు కూడా ఈ విషయం మీద ఘాటుగానే స్పందించి అల్లు అర్జున్ ని ఘాటుగా కామెంట్స్ చేయడంతో మళ్లీ రామ్ చరణ్ కల్పించుకొని క్షమాపణలు చెప్పించారు, అల్లు అర్జున్ తన తండ్రి తరపు వాళ్లను అంటే మెగా ఫ్యామిలీని కాదని ఒకరకంగా ధైర్యం చేసి నిలబడ్డాడని చెప్పాలి. తన ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే తన తండ్రి తరపు వాళ్లను అంటే మెగా ఫ్యామిలీని కాకుండా తన తల్లి తరపు వాళ్లని ప్రమోట్ చేసుకునే పనిలో ఆయన పడినట్లు తెలుస్తోంది.
తన మేనమామ కుమారుడు విరాన్ ముత్తంశెట్టి కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ కి మేనేజర్ గా పనిచేశాడు. నిజానికి అతనికి నటుడు అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేది. కానీ అసలు సినిమా అంటే ఏమిటి? సినిమా ప్రొడక్షన్ వంటి విషయాల మీద అవగాహన తీసుకొచ్చేందుకు అల్లు అర్జున్ అతనిని మేనేజర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన హీరోగా బతుకు బస్టాండ్ అనే సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా విడుదలైందో లేదో అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక యాడ్ ఫిలిం చేశారు.
జొమాటో సంస్థకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సదరు సంస్థ కోసం కొత్త యాడ్ ఒకదాన్ని నిన్న షూట్ చేశారు. ఈ షూట్ లో తనకు బావమరిది వరస అయ్యే విరాన్ ముత్తంశెట్టికి ఆయన అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా విరాన్ ముత్తంశెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు అల్లు అర్జున్ బావకు థాంక్స్ అంటూ రాసుకొచ్చారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుష్ప సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహిస్తే సహ నిర్మాణ సంస్థగా ఈ విరాన్ ముత్తంశెట్టికి సంబంధించిన ముత్తంశెట్టి మీడియా అనే సంస్థ వ్యవహరించింది. అయితే పుష్ప 2 సినిమాకి మాత్రం వీళ్లు సహనిర్మాతలుగా వ్యవహరించడం లేదు. పుష్ప 2లో సుకుమార్ కు సంబంధించిన సంస్థ సహా నిర్మాణ సంస్థగా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం మీద అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టేసుకున్నట్టే. ఇప్పుడు ఆ కొంపటిని బలంగా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే వాదన వినిపిస్తోంది.
Also Read: Murali Mohapatra Death Reason: పాటలు పాడుతూనే ప్రముఖ సింగర్ మృతి.. ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook