Chandigarh Airport: చంఢీగఢ్‌ ఎయిర్​పోర్ట్​కు భగత్‌సింగ్‌ పేరు...మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ప్రకటన

Chandigarh Airport: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2022, 04:16 PM IST
Chandigarh Airport: చంఢీగఢ్‌ ఎయిర్​పోర్ట్​కు భగత్‌సింగ్‌ పేరు...మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ప్రకటన

Chandigarh Airport Name Changed: చండీగఢ్ ఎయిర్ పోర్టును ఇకపై ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరుతో (Shaheed Bhagat Singh  Airport) పిలవనున్నారు. మన్​ కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్​ 28న భగత్‌సింగ్‌ జయంతి నాటికి దీనిని అమలు చేస్తామని ఆయన అన్నారు.  మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం జరుపుకుంటారు. ఇందులో భాగంగా నిర్వహించిన 90వ ఎపిసోడ్‌లో మోదీ (PM Modi) అనేక విషయాలపై ప్రసంగించారు. ప్రముఖంగా వాతావరణ మార్పులు, ఇటీవల నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాలు గురించి ప్రస్తావించారు. మరోవైపు ఇవాళ  దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకున్నారు మోదీ. 

ప్రస్తుతం వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను సవాళ్లుగా మారాయన్న మోదీ... బీచ్ లలో చెత్త పేరుకుపోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పెను సవాళ్లను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. 1952లో కనుమరుగైన తర్వాత చీతాలు తిరిగి దేశంలో అడుగుపెట్టడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు. చీతాలు టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయన్న మోదీ.. తర్వలోనే వాటిని చూసేందుకు ప్రజలకు అనుమతిస్తామని తెలిపారు.  అదే విధంగా ఈ చీతాలకు కొత్త పేర్లు సూచించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 

చండీగఢ్ ఎయిర్ పోర్టుకు (Chandigarh Airport) భగత్ సింగ్ పేరు పెడుతున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటనను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వాగతించారు, పంజాబీల దీర్ఘకాల పెండింగ్ డిమాండ్ నెరవేరిందని అన్నారు."చివరికి మా ప్రయత్నాలు ఫలించాయి. మొత్తం పంజాబ్ తరపున, చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ జీ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం" అని మన్ పంజాబీలో ట్వీట్ చేశారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కూడా ఈ ప్రకటనను స్వాగతించారు.

Also Read: Mission 2024: నితీష్ రాకతో కాంగ్రెస్ లో జోష్.. విపక్షాలను ఏకం చేసే పనిలో సోనియా గాంధీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News