DA Hike: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గుడ్‌న్యూస్, ఈ నెలలోనే డీఏ పెంపు ప్రకటన, సెప్టెంబర్ జీతం భారీగానే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది.సెప్టెంబర్ 28వ తేదీన ప్రకటన వెలువడనుంది.

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది.సెప్టెంబర్ 28వ తేదీన ప్రకటన వెలువడనుంది.
 

1 /5

మ్యాగ్జిమమ్ బేసిక్ శాలరీపై 4 శాతం డీఏ పెంపు ప్రభావం ఉద్యోగి కనీస జీతం                                                      56,900 కొత్త కరవు భత్యం 38 శాతంతో                                      21,622 నెలకు ప్రస్తుత కరవు భత్యం 34 శాతంతో                                19,346 నెలకు పెరగనున్న డీఏ మొత్తం                                              2260 నెలకు ఏడాది జీతంపై పెంపు                                                 27,120 రూపాయలు

2 /5

కరవు భత్యం 4 శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుకుంటుంది. పెరిగిన డీఏను సెప్టెంబర్ నెల జీతంతో ఇవ్వనున్నారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే నవరాత్రి పర్వదినాల ప్రారంభంలో సెప్టెంబర్ నెల జీతం అందుకునేటప్పుడు జూలై, ఆగస్టు నెలల డీఏ ఏరియర్స్‌తో కలిపి పెద్ద మొత్తం నగదు చేతికి అందుతుంది. 

3 /5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ నిర్ణయించేందుకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా భావిస్తారు. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ తొలి ఆరు నెలల గణాంకాంలు వచ్చేశాయి. జూన్ నెల సూచీ 129.2కు చేరుకుంది. ఇండెక్స్ పెరగడంతో డీఏ 4 శాతం పెరగడం ఖాయమైంది. 

4 /5

జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం..కరవు భత్యం డీఏను సెప్టెంబర్ 28న ప్రకటించనున్నారు. సెప్టెంబర్ జీతంలో రెండు నెలల ఏరియర్స్‌తో పాటు అంటే జూలై, ఆగస్టు డీఏ ఏరియర్స్‌తో పాటు లభించనుంది.

5 /5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం కోసం నిరీక్షణ ముగిసిపోనుంది. ప్రభుత్వం సెప్టెంబర్ 28వ తేదీన ఈ విషయాన్ని వెల్లడించనుంది. డీఏ ఎప్పట్నించి ఇస్తారో తేదీ కూడా ఖరారైంది.