Guru Vakri 2022: మీనంలో త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి అంతులేని ధనం!

Guru Vakri 2022: ప్రస్తుతం బృహస్పతి తన సొంత రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. దీని కారణంగా మధ్యలో త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఇది 3 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2022, 08:18 AM IST
Guru Vakri 2022:  మీనంలో త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి అంతులేని ధనం!

Jupiter Retrograde in Pisces 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, దేవగురువు బృహస్పతి ప్రస్తుం తన సొంత రాశి అయిన మీనరాశిలో తిరోగమనంలో (Jupiter Retrograde in Pisces 2022) ఉన్నాడు. జూలైలో మీనంలో తిరోగమనం చెందిన గురుడు నవంబరు 24 వరకు అదే స్థితిలో ఉంటాడు. ఇప్పుడు మీనరాశిలో గురుడు త్రికోణ రాజయోగాన్ని (Trikon rajyog) ఏర్పరుస్తున్నాడు. ఈ రాజయోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ రాశులవారు భారీగా లాభపడతారు. 

వృషభం (Taurus): మీనరాశిలో బృహస్పతి తిరోగమనం ద్వారా ఏర్పడుతున్న త్రికోణ రాజయోగం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. అంతేకాకుండా పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రస్తుతం ఉపశమనం పొందుతారు. 

కర్కాటకం (Cancer): తిరోగమన గురు కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. లక్ తో ఈ రాశివారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. విదేశాల్లో వ్యాపారాలు చేసే వారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. 

మిథునం (Gemini): తిరోగమన బృహస్పతి మిథునరాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. వీరు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఈ రాశివారికి కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Mercury Retrograde 2022: తిరోగమన బుధుడి ప్రభావం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News