/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Jayshah Trolls: ఆసియా కప్ తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ పై టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయాన్ని అసేతు హిమాచలం సెలబ్రేట్ చేసుకుంటోంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించిన వేలాదిమంది భారతీయులు ఉప్పొంగిపోయారు. హార్దిక్ పటేల్ విన్నింగ్ షాట్ కొట్టగానే దుబాయ్ స్టేడియం మొత్తం వందేమాతరం నినాదాలతో మార్మోగింది. పాకిస్తాన్ పై గెలుపుతో భారతీయులంతా పండుగ చేసుకుంటుండగా.. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషా మాత్రం వివాదంలో చిక్కుకున్నారు. నెటిజన్ల నుంచి భారీగా ట్రోల్ కు గురవుతున్నారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ ను బీసీసీఐ అధికారులతో కలిసి తిలకించారు అమిత్ షా కొడుకు జైషా. పాకిస్థాన్‌పై విజయం తర్వాత స్టేడియంలో ఉన్న భారతీయులు సంబరాలు చేసుకున్నారు. భారత జాతీయా జెండాలను ఊపుతూ కేరింతలు కొట్టారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి జైషా దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని అతనికి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయతే జాతీయ జెండాను తీసుకునేందుకు జైషా నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలైంది. కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు, బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా.. జాతీయ జెండాను తీసుకోవడానికి నిరాకరించడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జైషా తీరుపై మండిపడుతున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఆయన వివరణ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల హర్‌ ఘర్‌ తిరంగా అంటూ గొప్పలు చెప్పిన అమిత్ షా కుమారుడి దేశభక్తి. ఇదేనంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. జాతీయ జెండాను  తీసుకోవడానికి ఎందుకు నిరాకరించారంటూ నిలదీస్తున్నారు. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సందేశాలు ఇస్తారు.. కాని వాళ్లు మాత్రం పాటించరూ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.  జైషా తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జైషా వీడియోను షేర్‌ చేస్తూ .. బీజేపీ పెద్దల దేశభక్తి ఇదేనంటూ ట్రోల్ చేస్తున్నారు.

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క  ఈ ఘటనపై ట్విట్టర్ వేదిగా స్పందించారు. భారతదేశ జాతీయ జెండా అంటే అమిత్ షా కుమారుడికి  ఏమైనా ఎలర్జీ ఉందా? అంటూ సీతక్క ప్రశ్నించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ అని ట్వీట్ చేసిన సీతక్క.. అమిత్ షా కుమారుడు జై షా  జాతీయ జెండాను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పతాకంతో అమిత్ షా తనయుడు జై షా ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎందుకు అనుకోవడం లేదో చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క నిలదీశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Section: 
English Title: 
Amit Shah Son Jay Shah Refuses To Hold National Flag After India Pakistan Match Video Goes Viral
News Source: 
Home Title: 

జాతీయ జెండా పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్ షా కొడుకు!వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్

Jay shah Trolls: జాతీయ జెండా పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్ షా కొడుకు! వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్
Caption: 
jay shah
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జాతీయ జెండా పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్ షా కొడుకు!వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్
Srisailam
Publish Later: 
No
Publish At: 
Monday, August 29, 2022 - 15:24
Request Count: 
112
Is Breaking News: 
No