Japan: యూత్‌ను మద్యం వైపు ఆకర్షించేందుకు జపాన్ సరికొత్త క్యాంపెయిన్.. సలహాలు చెప్పాలంటూ విజ్ఞప్తి

Japan NTA Saka Viva Campaign: తమ దేశ యువత మద్యం ఎక్కువగా తాగట్లేదని జపాన్ బెంగపడిపోతోంది. యువతతో ఎక్కువ మద్యం తాగించే మార్గాల కోసం అన్వేషిస్తోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 20, 2022, 03:15 PM IST
  • జపాన్‌లో పడిపోయిన మద్యం ఆదాయం
  • యువతను మద్యం వైపు ఆకర్షించేందుకు సరికొత్త క్యాంపెయిన్
  • సలహాలు స్వీకరిస్తున్న జపాన్ ప్రభుత్వం
Japan: యూత్‌ను మద్యం వైపు ఆకర్షించేందుకు జపాన్ సరికొత్త క్యాంపెయిన్.. సలహాలు చెప్పాలంటూ విజ్ఞప్తి

Japan NTA Saka Viva Campaign: జపాన్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దేశ మొత్తం ఆదాయంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 1980లో 5 శాతం ఉండగా 2020 నాటికి 1.7 శాతానికి పడిపోయింది. దేశంలో వృద్ధ జనాభా ఎక్కువవడం, జననాల రేటు తగ్గిపోవడం, కోవిడ్ మహమ్మారి కారణంగా మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గిపోయినట్లు జపాన్ నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ వెల్లడించింది.

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు జపాన్ నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ 'సకా వివా' అనే క్యాంపెయిన్‌ని చేపట్టింది. యువతను మద్యం వైపు ఆకర్షించడం,ఎక్కువ మద్యం తాగేలా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం 20 ఏళ్లు-39 ఏళ్ల వయసున్న యువత నుంచి ఎన్‌టీఏ సృజనాత్మక ఆలోచనలు, సలహాలు, బిజినెస్ ప్లాన్స్ కోరుతోంది. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్, మెటావర్స్‌ను ఉపయోగించుకుని యువతలో దీన్ని ప్రమోట్ చేసే మార్గాల గురించి చెప్పాలని విజ్ఞప్తి చేస్తోంది.

మద్యం ప్రమోషన్‌కి సంబంధించిన యాక్టివిటీస్‌పై సెప్టెంబర్ నెలాఖరు వరకు యువత నుంచి ఎన్‌టీఏ సలహాలు స్వీకరించనుంది. అన్నింటిల్లోకెల్లా బెస్ట్ ప్లాన్స్‌ పంపించినవారిని నవంబర్ 10న విజేతలుగా ప్రకటించనుంది. ఆ ప్లాన్స్‌ను నిపుణుల సాయంతో కార్యరూపంలోకి తీసుకురానుంది. జపాన్ యువత మాత్రం 'సకా వివా' క్యాంపెయిన్‌ను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ క్యాంపెయిన్ పట్ల యువత అంతగా ఆసక్తి చూపట్లేదని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇలా మద్యం తాగాలని ప్రభుత్వమే క్యాంపెయిన్స్ నిర్వహించడమేంటని అక్కడి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా, జపాన్‌లో యువత జనాభా తగ్గిపోవడం ఆ దేశంపై చాలా ప్రభావం చూపిస్తోంది. మద్యం ఆదాయం తగ్గడమే కాదు.. కొన్ని జాబ్స్‌కి యువతీ యువకులైన స్టాఫ్ దొరకడం లేదు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం జపాన్ ప్రస్తుత జనాభాలో 65 శాతం వృద్ధులే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశం జపాన్‌నే కావడం గమనార్హం. ఈ సమస్యను అధిగమించడం ఇప్పుడు జపాన్ ముందున్న అతిపెద్ద సవాల్. 

Also Read: KCR Munugode Meeting Live Updates: మునుగోడు సభకు బయలుదేరిన కేసీఆర్.. 4 వేల కార్లతో భారీ కాన్వాయ్    

Also Read: TRS MLA DANCE: చిరంజీవి పాటకు తీన్మార్ స్టెప్పేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. టికెట్ రాదని ఫిక్స్ అయిపోయారంటూ కౌంటర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News