Karthikeya 2 Collections: కార్తికేయ 2 ఏడు రోజుల కలెక్షన్స్.. రివర్స్ లో షాకిస్తున్న వసూళ్లు!

Karthikeya 2 World Wide 7 Days Collections: సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కార్తికేయ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కలెక్షన్స్ రిపోర్టులో చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 01:02 PM IST
  • నిఖిల్ హీరోగా కార్తికేయ 2
  • మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్
  • దుమ్మురేపుతున్న వసూళ్లు
Karthikeya 2 Collections: కార్తికేయ 2 ఏడు రోజుల కలెక్షన్స్.. రివర్స్ లో షాకిస్తున్న వసూళ్లు!

Karthikeya 2 World Wide 7 Days Collections:నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కార్తికేయ 2 ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారం రోజుల దియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ఈ సినిమా ఇకపై వసూలు చేసేదంతా కార్తికేయ 2 మేకర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద బోనస్ అని చెప్పాలి.

2014వ సంవత్సరంలో నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్గా కార్తికేయ అనే సినిమా రూపొందింది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అలా ప్రకటించిన దాని మేరకు కార్తికేయ 2 సినిమా సిద్ధం చేశారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్పించారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించగా శ్రీనివాసరెడ్డి, తులసి, వైవా హర్ష అనుపమ్ ఖేర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య మీనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కానీ థియేటర్ల వ్యవహారంలో కాస్త ఇబ్బందులు ఏర్పడడంతో పలుసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Karthikeya 2 Telugu States 7 Days Collections: 

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి రోజే మూడున్నర కోట్లు సంపాదించగా రెండో రోజు మూడు కోట్ల 81 లక్షలు, మూడో రోజు నాలుగు కోట్ల 23 లక్షలు, నాలుగో రోజు రెండు కోట్ల 15 లక్షలు, 5వ రోజు కోటి 61 లక్షలు, ఆరవ రోజు కోటి 32 లక్షలు సంపాదించింది. ఇక ఏడవ రోజు వసూళ్లలో మళ్ళీ పెరుగుదల కనిపించింది.

ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటివరకు వారం రోజులకు గాను 18 కోట్ల 69 లక్షల షేర్, 29 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక కార్తికేయ సినిమా కర్ణాటక సహా మిగతా రాష్ట్రాల్లో కోటి 64 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో మూడు కోట్ల పాతిక లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా ఐదు కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. 

Karthikeya 2 7 Days Hindi Collections:

అయితే హిందీలో మొదటి రోజు 50 స్క్రీన్లతో ప్రారంభమైన ఈ సినిమా జన్మాష్టమి నాటికి 1000 నుంచి 1500 స్క్రీన్ లకు వెళ్లి దాదాపు నార్త్ లో క్రమేపీ వసూళ్లు పెంచుకుంటూ వెళుతుంది. విడుదలైన మొదటి రోజు హిందీలో ఏడు లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా తర్వాత రోజు 27 లక్షలు, కోటి పది లక్షలు, కోటి 28 లక్షలు, కోటి 38, కోటి 64 లక్షలు వసూలు చేసే వరకు వెళ్ళింది. ఇక శుక్రవారం నాడు జన్మాష్టమి కావడంతో షోస్ బాగా పెరిగాయి.

దీంతో సుమారు రెండు కోట్ల వరకు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ 50 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయినా సరే థియేటర్ బిజినెస్ మాత్రం 12 కోట్ల 80 లక్షల రూపాయలు మాత్రమే జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 13 కోట్ల 30 లక్షల రూపాయలు ఫిక్స్ చేశారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన ఈ సినిమా 14 కోట్ల 73 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. తద్వారా ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Also Read: Actress Namitha blessed with twins: నమితకు కవల పిల్లలు.. ఫోటోలు చూశారా?

Also Read: Rhea Chakraborty Hot Photos: సుశాంత్ రాజ్ పుత్ ప్రియురాలి హాట్ ట్రీట్.. అంతా కనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x