Railtel Offer: ప్లాన్ ఒకటే. కానీ 13 ఓటీటీల సబ్స్క్రిప్షన్. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5 సహా 13 ఓటీటీలు పొందే అవకాశం. ఎలాగంటే..
ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ తప్పకుండా ఉంటున్నాయి. వివిధ టెలీకం కంపెనీలు వేర్వేరు ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. కొన్ని ప్లాన్స్‌లో ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తున్నాయి. మరికొన్ని ప్లాన్స్‌లో అయితే ఏకంగా 13 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తున్నాయి. ఇందులో అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ వేదికలున్నాయి. ఈ ప్లాన్స్ వివరాలేంటో చూద్దాం..
అయితే ఈ ఆఫర్..ఎయిర్టెల్ , వోడాఫోన్, రిలయన్స్ జియో కంపెనీల నుంచి కాదు. రెయిల్‌టెల్ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ రైల్‌వైర్ ఆఫర్ చేస్తోంది. రైల్‌వైర్ బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా చవకే. మంచి నెట్వర్క్, స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది.
రైల్‌టెల్ అధికారికంగా ఇటీవల ఈ ఆఫర్ గురించి ప్రకటించింది. 50, 100 ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇందులో రైల్‌వైర్ సత్రంగ్తో పాటు 13 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. ఈ ఓటీటీ యాప్స్‌లో అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఎరోస్ నౌ, సన్నెక్స్ట్, ఆహా, ఎపికాన్, ఎంఎక్స్ ప్లేయర్, వూటా్, హంగామా మూవీస్, హంగామా మ్యూజిక్ ప్రో ప్లాట్‌ఫామ్స్ ఉచితం. ఇవి కాకుండా ఇంకొన్ని మ్యూజిక్ ఛానెల్స్ కూడా ఉన్నాయి.
Also read: WhatsApp Companion Mode: కంపానియన్ మోడ్... వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.