ఇడియట్.. స్టుపిడ్.. ఇప్పుడు బేవార్స్

    

Last Updated : Oct 23, 2017, 03:42 PM IST
ఇడియట్.. స్టుపిడ్.. ఇప్పుడు బేవార్స్

తెలుగు సినిమాల్లో తిట్లను టైటిల్స్‌గా పెట్టి చిత్రాలు తీయడం కొత్తేమీ కాదు. దొంగ రాస్కెల్, ఇడియట్, స్టుపిడ్, పోరంబోకు, సోంబేరీ, జఫ్ఫా లాంటి సినిమాలు గతంలో వచ్చాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో చిత్రం కూడా వస్తోంది.

ఆ చిత్రం పేరే "బేవార్స్". రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో సంజోష్, హర్షిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి చెప్పాల రమేష్ దర్శకుడు. గతంలో ఈయన రాజేంద్రప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి అనే చిత్రానికి కథా సహకారం అందించారు. 

ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై పొన్నాల చందు, ఎమ్‌. అరవింద్‌ నిర్మిస్తున్న " బేవార్స్" చిత్రం ఇటీవలే సారధి స్టూడియోస్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలను సుద్దాల అశోకతేజ, భాస్కరభట్ల రాశారు. అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

Trending News