Urad Dal Side Effects: మినపప్పు చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేస్తాయి. మినపప్పు వల్ల మానవ శరీరానికి లాభాలు ఎన్ని ఉన్నయో, అన్ని రకాల దుష్ప్రభావాలున్నాయి. దీని తినడం వల్ల వచ్చే నష్టాలు తెలువక చాలా మంది ఈ పప్పును విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. ఈ పప్పును ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్, గౌట్ సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మినపప్పును ఎంత మోతాదులో తీసుకోవాలి. ఏ వ్యక్తులు దీన్ని అస్సలు తినకూడదో తెలుసుకుందా.
మినపప్పును ఎంత మోతాదులో తినాలి?:
ఈ పప్పును రోజూ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. మినపప్పును కేవలం వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తినలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని అధికంగా తినడం వల్ల శరీరంలో మార్పులు వచ్చి అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపులున్నారు.
ఈ సమస్యలతో బాధపడుతున్న వారు అస్సలు ఈ పప్పును తినకూడదు:
- ఇప్పటికే కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పప్పును తినకూడదు.
- అజీర్ణం సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పప్పును తినకూడదు. ఉడకబెట్టిన పప్పును తింటే..మలబద్ధకం, కడుపులో గ్యాస్, ఉబ్బరం మొదలైన సమస్యలు వస్తాయి.
- దీనితో పాటు, యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఈపప్పుకు దూరంగా ఉండాలి. ఇవి కిడ్నీలో కాల్సిఫికేషన్ రాళ్లు పెరగడానికి దోహదపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ ప్రిస్క్రిప్షన్‌లను ఆమోదించదు.)
Also Read: Horoscope Today June 8th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ ప్రపోజ్‌కు అనుకూలమైన రోజు...
Also Read: Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 18 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook