Brutal Murder: వివాహేతర సంబంధం మరో రెండు కుటుంబాలలో విషాదం నింపింది పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న మరో యువకుడితో పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ ఇద్దరినీ పొట్టన పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ఆ యువకుడితో ఏకాంతంగా గడపటానికి వెళ్లిన వారు రోడ్డు పక్కన విగతజీవులుగా పది ఉండటాన్ని గమనించిన గీత కార్మికుడు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదుకి చేసుకున్నారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు.
సికింద్రాబాద్ వారాసిగూడలోని బౌద్ధ నగర్ కి చెందిన ఎడ్ల యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ గ పని చేస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన జ్యోతి తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది వీరి మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండా వీరు తరచూ బయట కలిసేవారు. అదే విధంగా ఆదివారం రోజున ఇద్దరు బయటకు వెళ్లాలని యశ్వంత్ సోదరుడి బండి తీసుకోని నగర శివారులో ఉన్న కొత్తగూడెం బ్రిడ్జి వద్దకు చేరి బ్రిడ్జి కింద ఉన్న చెట్ల పొద్దలోకివెళి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వారు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల క్లూస్ టీమ్ అనేక ఆధారాలను సేకరించింది ఘటన స్థలంలో లభించిన టార్చ్ లైట్ , చాప,వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ ఫోన్ చార్జర్ ప్లాస్టిక్ పూలు లభించాయి. అయితే హత్య జరిగిన తీరు ఘటన స్థలంలో లభించిన ఆధారాలతో తెలిసిన వారే హత్య చేసినట్లు గుర్తించారు. మృతుల ఒంటిపైనా లభించిన ఆధారాలతో హత్యను ఛేదించిన పోలీసులు మృతురాలి తల,మొఖంపై బండరాయితో మోది హత్యచేశారు. యశ్వంత్ తల చాతి భాగాలపై బలంగా కొట్టడంతో పటు అతడి మర్మాంగాలపై దారుణంగా పొడిచి చిత్రవధ చేసి హత్య చేసినట్లు గుర్తించారు.
రెండు రోజులైనా కదలని బండి:
హత్య జరిగిన ప్రాంతంలో రెండు రోజులనుండి ఆగి ఉన్న యాక్టీవ్ బైక్ ని గుర్తించిన గీత కార్మికుడు అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లే సరికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు బైక్ రిజిస్టేషన్ ఆధారంగా మృతుల వివరాలు సులభంగా లభించాయి.. ఈ హత్యల వెనుక జ్యోతి భర్త శ్రీనివాస్ ఉన్నట్లు అనుమానించిన పోలీసులు శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకోని ప్రశ్నించడంతో మరో నలుగురితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
Also Read: Hyderabad: నగరవాసులకు విజ్ఞప్తి... మీ ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!
Also Read: Bath Mistake: అన్నం తిన్న తర్వాత తలస్నానం చేయొద్దు..ఆరోగ్యంపై అనేక ఎఫెక్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook