Little girl comforting a little boy: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరు ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా ఉంటున్నారు. ఒక్కోసారి సొంతవారితో కూడా సమయం వెచ్చించలేని పరిస్థితి ఉంది. దాంతో ప్రజలలో సానుభూతి, కనికరం లేకుండా పోతోంది. అయితే ఒక చిన్నారి తన క్లాస్‌మేట్‌ను ఓదార్చడం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబందించిన వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాకు చెందిన ఓ చిన్న పిల్లాడు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. ఇంటికి దూరంగా ఉన్నందుకు ఆ పిల్లడు కలత (హోమ్ సిక్) చెందాడు. ఇళ్లు, అమ్మ గుర్తుకురావడంతో చిన్నారి ఏడుస్తూ ఉంటాడు. ఇది గమనించిన ఆ పిల్లాడి క్లాస్‌మేట్ అయిన ఓ అమ్మాయి అతడిని ఓదార్చింది. 'హమ్ లోగ్ జాయేంగే ఏప్రిల్ మెయిన్, ఐసే నహీ రోనా హై' అని చిన్న అమ్మాయి పిల్లాడి తల, భుజంపై తడుముతూ దైర్యం చెప్పింది.
'అమ్మ గుర్తుకు వచ్చిందా. బాధపడకు.. మేమంతా ఉన్నాం కదా?. ఏప్రిల్‌లో మనము ఇంటికి వెళ్తాము, అది కూడా విమానంలో వెళ్లుదాం. దయచేసి ఏడవకు' అని అమ్మాయి తన క్లాస్‌మేట్‌ను ఓదార్చింది. ఆ అమ్మాయి మాత్రమే కాదు.. పక్కనే ఉన్న మరో ఇద్దరు కూడా ఆ పిల్లాడికి సర్ధిచెపుతారు. తన క్లాస్‌మేట్ చెప్పిన మాటలకు ఆ చిన్నోడు సరే సరే అంటాడు. ఈ వీడియోని బెటర్ ఇండియా అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
😊 Made my day https://t.co/1EUYjjx5xq
— KTR (@KTRTRS) February 20, 2022
ఈ వీడియోను అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అంతేకాదు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి 'మేడ్ మై డే' కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం వైరల్ అయింది. వీడియో చోసిన అందరూ చిన్నారి పనికి ఫిదా అవుతున్నారు. 'ఇంత చిన్న వయస్సులోనే గొప్ప మనసు చాటుకున్న చిన్నారి', 'పాప నువ్ సూపర్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral Crime News: ఆమ్లెట్ వేసివ్వలేదని భార్య గొంతు నులిమి చంపిన భర్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook