/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Blueberries Benefits: మధుమేహం.. ప్రపంచమంతా సర్వ సాధారణంగా కన్పిస్తున్న సమస్య. ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న సమస్యల్లో ప్రధానమైంది ఇదే. బ్లూబెర్రీస్ పండ్లు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎలాగో తెలుసుకుందాం..

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రధానంగా కన్పిస్తున్న రుగ్మత డయాబెటిస్. ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతా ఇదే పరిస్థితి. 20-30 ఏళ్ల వయస్సువారికి కూడా డయాబెటిస్ వెంటాడుతోంది. జాగ్రత్తలు పాటిస్తే ఎంత నియంత్రణలో ఉంటుందో..నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంత ప్రమాదకరం కూడా. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, షుగర్‌లెస్ ఫుడ్ వంటి అలవాట్లతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. అదే సమయంలో బ్లూ బెర్రీస్ ఫ్రూట్స్‌తో మధుమేహం (Blueberries Benefits) నియంత్రించవచ్చంటున్నారు వైద్యులు. 

టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ పండ్లు టైప్ 2 డయాబెటిస్ (Diabetes) నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే పోషక పదార్ధాలు జీర్ణప్రక్రియకు దోహదపడుతాయి. ఫలితంగా చక్కెర స్థాయి నియంత్రణ సాధ్యమవుతుంది. బ్లూ బెర్రీస్ పండ్లే కాకుండా ఆకులు కూడా డయాబెటిస్‌ను నివారిస్తాయి. బ్లూ బెర్రీస్ ఆకులతో తయారు చేసిన కషాయం మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచి ఔషధం. అయితే ఆయుర్వేద వైద్య నిపుణుల సూచనల మేరకు తగిన మోతాదులోనే ఈ కషాయం తీసుకోవల్సి ఉంటుంది. బ్లూ బెర్రీస్ ఆకులు, పండ్లలో విటమిన్లు, పోషకాలు, లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉపయోగపడుతాయి.

బ్లూ బెర్రీస్ (Blueberries) పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ కేన్సర్ లక్షణాలతో పాటు పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.  వీటి కారణంగా డయాబెటిస్ నియంత్రణ సాధ్యమవుతుందని జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఉంది. బ్లూ బెర్రీస్ పండ్లతో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ దూరమవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. బ్లూ బెర్రీస్ అనేది కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాకుండా జ్ఞాపకశక్తి పెంచడంలో దోహదపడుతుంది. మెదడులోని సెల్స్‌ను యాక్టివ్ చేస్తాయి. బ్లూ బెర్రీస్ తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity)పెరుగుతుంది. 

Also read: Pudina Health Benefits: పుదీనాపై తాజా పరిశోధన, ఒత్తిడి దూరం చేయడంలో అద్భుత ఔషధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Blueberries health benefits in Diabetes control, how they useful in type 2 diabetes
News Source: 
Home Title: 

Blueberries Benefits: మధుమేహం నియంత్రణలో అద్భుతంగా పనిచేసే బ్లూ బెర్రీస్

Blueberries Benefits: మధుమేహం నియంత్రణలో అద్భుతంగా పనిచేసే బ్లూ బెర్రీస్
Caption: 
Blueberries Benefits ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Blueberries Benefits: మధుమేహం నియంత్రణలో అద్భుతంగా పనిచేసే బ్లూ బెర్రీస్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, January 16, 2022 - 11:54
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
114
Is Breaking News: 
No