Covid Cases in India: దేశంలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7,774 నమోదు కాగా.. 306 మంది మరణించారు. శనివారం 11,89,459 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 7,774 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు కరోనా ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 4,75,434కి చేరింది.
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 8,464 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.41 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.36 శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,281కి చేరింది.
దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కొవిడ్ పరిస్థితిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి జిల్లాస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించింది. పాజిటివిటీ రేటు 10% దాటినా.. 60 శాతానికి పైగా ఆసుపత్రి పడకలు నిండినా.. అలాంటి జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ సహా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
Also Read: పాఠశాల సెలవుల కోసం మంచినీటిలో పురుగు మందు కలిపిన విద్యార్థి.. 19 మందికి అస్వస్థత
Also Read: Gas Leak in Erode: రసాయన పరిశ్రమలో లీకైన విషవాయువు...ఒకరు మృతి, 13 మంది పరిస్థితి విషమం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook