Sangeeta Bijlani Looks: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ 1996లో సంగీతా బిజిలానీను పెళ్లి చేసుకున్నాడు. తొలి భార్య నూరీన్కు విడాకులిచ్చేశాడు. అయితే సంగీతాతో అజారుద్దీన్ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2010లో ఇద్దరూ విడిపోయయారు. ఇప్పుడా సంగీతా బిజిలానీ ఎలా ఉందో చూస్తారా..
సంగీతా బిజిలానీ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంచి స్నేహితురాలు. సల్మాన్ ఖాన్ ఫంక్షన్స్‌లో తరచూ కన్పిస్తుంటుంది.
60 ఏళ్ల వయస్సులో కూడా సంగీతా బిజిలానీ అందంలో బాలీవుడ్ హీరోయిన్లకు తీసిపోనంటోంది. ఇటీవల సంగీతా బిజిలానీ సల్మాన్ ఖాన్ సినిమా అంతిమ్ ప్రీమియర్‌లో కన్పించింది. అక్కడీమె మినీ స్కర్ట్‌లో కన్పించి ఫిదా చేసింది.
సంగీతా బిజిలానీ జూలై 1960లో పుట్టింది. ముంబైలో పుట్టిన సంగీతాకు ఇప్పుడు 61 ఏళ్ళు. కానీ ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే ఉంది.
సంగీతా బిజిలానీ త్రిదేవ్, హాతిమ్ తాయ్, యోద్ధా వంటి ప్రముఖ బాలీవుడ్ సినిమాల్లో నటించింది.
ఓ వైపు వయస్సు పెరుగుతున్నా సంగీతా బిజిలానీ మాత్రం ఫిట్నెస్ , స్టైల్లో ఎక్కడా తగ్గడం లేదు. ఆరోగ్యం, డైట్ విషయాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది.