Anandayya Covid-19 Medicine Home Delivery: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుకు దేశ వ్యాప్తంగా డిమాండ్ వచ్చింది. ప్రభుత్వం ఆ కరోనా మందును నిలిపివేయడాన్ని సైతం సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. మందుపై పరిశీలన చేసిన సంస్థ దాని నుంచి దుష్ప్రభావాలు లేవని నివేదిక ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చింది.
మూలికలు, ఆకులు, వంటింటి ధాన్యాలతో ఆనందయ్య తయారు చేస్తున్న ఔషధానికి అనుమతి లభించినా, నివేదిక రాని కారణంగా చుక్కల మందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య తయారు చేస్తున్న ఔషధాన్ని (Krishnapatnam Corona Medicine) పంపణీ చేయాలని భావించిన టీటీడీ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆనందయ్య మందును తాము పంపిణీ చేయడం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆనందయ్య మందును ఆయుర్వేద ఔషధంగా ఎక్కడా ప్రకటించలేదని, అందువల్ల టీటీడీ ఆయుద్వేద కాలేజ్ నుంచి పంపిణీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Anandaiah Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
అనుమతులు రాకముందు టీటీడీ ఆయుర్వేద కాలేజీ ఆనందయ్య మందు ( Anandaiah Medicine) పంపిణీ చేయాలని భావించింది. కానీ రెండు కారణాలతో ఆనందయ్య ఔషధాన్ని పంపిణీ చేయడంలో టీటీడీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రధాన కారణం ఇది ఆయుర్వేద ఔషధం అని నివేదికలో ప్రకటించలేదు. మరోవైపు కరోనా వైరస్ సోకిన వారికి ఇది ఔషధం (Medicine For COVID-19) కాదని ఏపీ ప్రభుత్వం సైతం స్పష్టం చేయడం మరో కారణంగా కనిపిస్తోంది. ఆనందయ్య మందును రోగనిరోధశక్తిని పెంచే ఔషధంలా సైతం వినియోగిస్తున్నారు. childeal.in వెబ్‌సైట్ ద్వారా మెడిసిన్ అందుబాటులోకి రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా
ఆనందయ్య ఔషధానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం అనుమతులు
కంట్లో చుక్కల మందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వని సర్కార్
టీటీడీ ఆయుర్వేద కాలేజీ మందును పంపిణీ చేయదన్న టీటీడీ చైర్మన్