Hyderabad Metro Timings: కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 9వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల టైమింగ్స్ సవరించారు.
ట్రాఫిక్ సమస్యలు తప్పించుకునేందుకు, ఏ ఇబ్బంది లేకుండా సమయానికి ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా పనులు పూర్తి చేసుకునేందుకైనా హైదరాబాద్‌లో సొంతంగా వాహనం లేని వారు మెట్రో రైలు సర్వీసులను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మెట్రో రైలు వేళలు మార్పు చేశారు. నేటి నుంచి లాక్డౌన్ విధించిన జూన్ 9 వరకు మెట్రో రైలు (Hyderabad Metro) తొలి సర్వీసు ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. చివరి మెట్రోరైలు సర్వీసు ఉదయం 11:45 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. చివరి రైలు సర్వీసు 12:45 చివరి స్టేషన్‌కు చేరుకుని సేవలు నిలిచిపోతాయని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Passengers are requested to cooperate with LTMRHL's security personnel & staff and are also advised to follow the Covid-19 safety guidelines strictly: observe social distancing, wear face masks, regular hand sanitisation and thermal screening, among others. #HyderabadMetro pic.twitter.com/Qm9kl6czYX
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 30, 2021
కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు Hyderabadలో సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను జూన్ 9 వరకు మరో 10 రోజులపాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపు పొడిగించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని తెలంగాణ ప్రజలకు ఆయన సూచించారు.
Also Read: World No Tobacco Day 2021: స్మోకింగ్ మానేస్తేనే కరోనా ముప్పును ఎదుర్కోవచ్చు, WHO
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook