US, UK on Covaxin: కోవాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్ ఇచ్చిన అమెరికా, బ్రిటన్

No entry for Covaxin users in to US, UK: వాషింగ్టన్: అమెరికా, బ్రిటన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాకు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన వ్యాక్సిన్ లిస్టులో చోటు దక్కలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2021, 06:17 AM IST
US, UK on Covaxin: కోవాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్ ఇచ్చిన అమెరికా, బ్రిటన్

No entry for Covaxin users in to US, UK: వాషింగ్టన్: అమెరికా, బ్రిటన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాకు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన వ్యాక్సిన్ లిస్టులో చోటు దక్కలేదు. అయితే, అమెరికా, బ్రిటన్ దేశాలు మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన టీకాలు తీసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని స్పష్టంచేశాయి. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన వ్యాక్సిన్ల జాబితాలో లేని కోవ్యాక్సిన్ తీసుకుని అమెరికా, బ్రిటన్ వెళ్లాలని భావించిన వాళ్లందరి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. 

Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?

కోవ్యాక్సిన్ టీకాలపై (Covaxin vaccine) అమెరికా, బ్రిటన్ తమ వైఖరిని స్పష్టంచేసిన నేపథ్యంలో కొత్తగా టీకాలు తీసుకునే వాళ్లు కూడా ఆలోచనలో పడ్డారు. ఇదిలావుంటే, ఈ వివాదంపై స్పందించిన కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ మాత్రం అమెరికా, బ్రిటన్లలోని వైరస్‌ను సమర్థవంతంగా ఎదురుర్కునే శక్తిని కలిగి ఉందని చెబుతోంది. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు కోసం కూడా భారత్ బయోటెక్ (Bharat Biotech) తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News