రెండు ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ సుశీల్ కుమార్ హత్య కేసులో ఇరుక్కోవడం అనేది క్రీడా వర్గాల్లో గత రెండు వారాల నుంచి చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తి సైతం రెజ్లర్, అందులోపూ జూనియర్ స్థాయిలో జాతీయ ఛాంపియన్ సాగర్ రాణా కావడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
మే 4వ తేదీన ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెజ్లర్ల మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అతడి సహచరులు, స్నేహితులు అయిదు మందిని ఔటర్ ఢిల్లీలో స్పెషల్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. 18 రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్ మరియు అతడి స్నేహితులు, సహచర రెజ్లర్లు మొత్తం 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దాటి ప్రయాణించినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. యువ రెజ్లర్ సాగర్ రాణా చనిపోయాడని తెలియగానే తన సహచర రెజ్లర్లతో పాటు సుశీల్ కుమార్ (Wrestler Sushil Kumar) పరారీలో ఉన్నాడు.
Also Read: IPL 2021: టీ20 ప్రపంచ కప్ కంటే ముందుగానే ఐపీఎల్ 2021 మిగతా సీజన్ పూర్తి
సుశీల్ కుమార్‌పై లక్ష రూపాయలు, అతడి స్నేహితుడు అజయ్ కుమార్‌పై రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించి పోలీసులు గాలింపు ముమ్మరం చేసి ఆదివారం నాడు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన వివాదానికి సంబంధించి తన స్నేహితులు, సహచర రెజ్లర్లతో సుశీల్ కుమార్ వీడియో సైతం తీయించాడని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో జూనియర్ రెజ్లింగ్ మాజీ ఛాంపియన్ సాగర్ రాణా, అతడి స్నేహితులు సోను, అమిత్ కుమార్‌లపై సుశీల్ కుమార్, అతడి సన్నిహిత రెజ్లర్లు దాడి చేస్తున్నట్లుగా ఉందన్నారు. అనంతరం సాగర్ రాణా చనిపోయాడని తెలుసుకుని నిందితులు తప్పించుకునేయత్నం చేశారని, ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు.
Also Read: Wrestler Sushil Kumar Arrested: రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన స్పెషల్ టీమ్ పోలీసులు
హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పలు సిమ్ కార్డులను మార్చినట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) గుర్తించారు. నిందితులపై సెక్షన్లు 302 (హత్య, 365 (అపహరణ), 325 (తీవ్రగాయాలు చేయడం), మరియు 506 (బెదిరింపులకు పాల్పడటం) సహా మరిన్ని సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ కోర్టు వీరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌కు ఆరు రోజుల కస్టడీకి సిటీ కోర్టు తీర్పు వెలువరించడం తెలిసిందే. అయితే రెజ్లింగ్ సర్కిల్‌లో తనను ఎవరూ వ్యతిరేకించకూడదని, తన హవా కొనసాగాలని, భవిష్యత్తులో తనకు సాగర్ రాణా నుంచి ఇబ్బంది తలెత్తకూడదని భావించి అతడిపై దాడి చేసినట్లుగా ప్రాథమికంగా తేలింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook