India Coronavirus update: ఇండియాలో కరోనా భయంకర పరిస్థితులు నెలకొన్నాయని అగ్రదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇండియాను ఆదుకోవల్సిన అవసరముందని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ప్రకటించాయి. ఇండియాలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందన్నారు.
ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave) దారుణంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతుండటంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి. ఇండియాలో కోవిడ్ పరిస్థితులు ( Indian Covid situation) భయానకంగా ఉన్నాయని అమెరికా(America), ఫ్రాన్స్(France) దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై సహాయం అందించే విషయమై రెండు దేశాలు స్పందించాయి. అమెరికా అధ్యక్షుడైన జో బిడెన్ ( Joe Biden) ప్రధాన వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ( Dr Anthony Fouci) ఈ విషయంపై మాట్లాడారు. కరోనా విషయంలో ఇండియా అతి భయంకర పరిస్థితిని ఎదుర్కొంటోందని..ఇండియాను ఆదుకోవల్సిన అవసరముందని చెప్పారు. వ్యాక్సిన్ ముడిపదార్ధాల ఎగుమతిపై నిషేధం ( Us Ban on Vaccine Raw material export) విషయంలో మాత్రం ఏం చేయలేమన్నారు.
ఒక్కరోజులోనే ఎన్నడూ లేనంతగా కేసులు నమోదవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. యూఎస్ ( USA) నుంచి ఎలాగైనా సరే ఇండియాకు సహాయం అందించాలని చెప్పారు. మరోవైపు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ ( France president Immannuel ) కూడా ఇదే విషయంపై స్పందించారు. ఇండియాకు అన్నివిధాలా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా కేసులు పెరిగి ఇబ్బంది పడుతున్న భారత ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. కష్ట సమయంలో ఫ్రాన్స్ (France) ఇండియాకు తోడుగా ఉంటుందని..మహమ్మారి ఎవర్నీ విడిచిపెట్టేలా లేదని..అందరూ కలిసి ఎదుర్కోవల్సిన అవసరముందని చెప్పారు.
Also read: India Coronavirus update: భారత్‌లో కరోనా వినాశకర పరిస్థితులు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook