Hina khan got engaged: బుల్లితెర నటి హీనా ఖాన్. పెద్దగా పరిచయం అవసరం లేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతోందని.. ఇటీవలే ఆమె నిశ్చితార్ధమైందని ఇలా విభిన్న రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఎందుకంటే వాలంటైన్ డే సందర్బంగా ఆమె ఇటీవల డైమండ్ రింగ్ ధరించిన ఫోటోలతో పాటు బాయ్‌ఫ్రెండ్ రాకీ జైశ్వాల్‌తో కలిసున్న ఫోటోల్ని షేర్ చేసింది. దాంతో ఈ ఫోటోల్ని చూసి అంతా నిశ్చితార్ధమైందనే అభిప్రాయానికి వచ్చి..కామెంట్లు ప్రారంభించారు. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నిశ్చితార్ధమైందా లేదా అనేది ఆమెనే నిర్ధారించాల్సి ఉంది.