ఏరోపోనిక్ పొటాటో ఫార్మింగ్ ( Aeroponic Potato Farming ) ద్వారా ఇప్పుడు బంగాళాదుంపల్ని మట్టి లేకుండా..భూమి లేకుండా గాలిలో పండించనున్నారు. ఈ టెక్నిక్‌తో బంగాళదుంప దిగుబడి భారీగా ఉంటుంది. రైతులకు పదిరెట్ల లాభం కలుగుతుంది.
సాంప్రదాయ వ్యవసాయసాగుతో పోలిస్తే ఈ పద్ధతిలో ఎక్కువ లాభముంటుందనేది రుజువైంది. ఈ పద్ధతిలో గింజ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 3-4 రెట్లు పెంచుతున్నారు. ఏరోపోనిక్ టెక్నాలజీతో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రయోజనం ఉంటుంది.
ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో బంగాళాదుంప సాగు చేసి..ఎక్కువ లాభాల్ని ఆర్జించవచ్చు. ఏరోపోనిక్ పద్దతిలో వ్రేళాడుతున్న వేర్ల ద్వారా న్యూటిఏంట్స్ ఇస్తారు. ఈ పద్ధతిలో సాగుకు మట్టి, భూమి అవసరం లేదు.
కర్నాల్‌లోని పొటాటో టెక్నాలజీ సెంటర్‌కు..ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్‌తో ఎంవోయూ కుదిరింది. ఆ తరువాత ఏరోపోనిక్ టెక్నాలజీ ద్వారా బంగాళదుంప సాగుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. రైతులకు ఈ దిశగా శిక్షణ ఇచ్చేందుకు హార్టికల్చర్ శాఖకు బాధ్యతలు అప్పగించారు.
హర్యానా కర్నాల్ జిల్లాలో ఉన్న పొటాటో టెక్నాలజీ సెంటర్.. ఏరోపోనిక్ పొటాటో ఫార్మింగ్‌పై పని చేసింది. ఈ టెక్నిక్ ద్వారా కేవలం భూమి కొరతను అధిగమించడమే కాకుండా పదిరెట్లు ఎక్కువ లాభాల్ని ఆర్జించవచ్చు.
వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ..ఇది నిజమే. గాలిలోనే బంగాళాదుంపల్ని ఇకపై పండించవచ్చు. ఏరోపోనిక్ పొటాటో ఫార్మింగ్ ద్వారా ఇది సాధ్యమైంది. ఇలా పండించడానికి మట్టి, భూమి అవసరమే లేదు.