ప్రైవసీ పాలసీలో తీసుకొచ్చిన మార్పులపై వాట్సప్ పునరాలోచనలో పడింది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్ల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలీగ్రామ్ యాప్‌ల వైపు దృష్టి సారించారు. దాంతో వాట్సప్ వెనుకడుగేసింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రత్యేక స్టేటస్ పోస్ట్‌ల ద్వారా జనాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ స్టేటస్ పోస్ట్‌లలో ఏముందంటే..
Whatsapp status details: ప్రైవసీ పాలసీలో తీసుకొచ్చిన మార్పులపై వాట్సప్ పునరాలోచనలో పడింది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్ల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలీగ్రామ్ యాప్‌ల వైపు దృష్టి సారించారు. దాంతో వాట్సప్ వెనుకడుగేసింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రత్యేక స్టేటస్ పోస్ట్‌ల ద్వారా జనాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ స్టేటస్ పోస్ట్‌లలో ఏముందంటే..
వాట్సప్ తొలి పోస్ట్‌లో...యూజర్ల ప్రైవసీపై చిత్తశుద్ధితో ఉన్నట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రైవసీ సురక్షితం విషయంలో నెలకొన్న స్పెక్యులేషన్స్‌పై అధికారిక ప్రకటన చేసింది.
వాట్సప్ సంస్థ ఒకరి వ్యక్తిగత సంభాషణ లేదా చాట్‌ను చదవడం గానీ వినడం గానీ చేయదని రెండవ పోస్ట్‌లో పెట్టింది. ఎందుకంటే వాట్సప్ చాట్ అంతా ఎన్క్రిప్టెడ్ అయుంటుందని వివరణ ఇచ్చింది.
వాట్సప్ మీరు షేర్ చేసిన లొకేషన్‌ను ఎప్పుడూ కనీసం చూడదని మూడవ పోస్ట్ పెట్టింది.
వాట్సప్ మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోదని నాలుగవ స్టేటస్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది.