Vijay: మాస్టర్ కలెక్షన్ల వర్షం.. తొలిరోజు ఎంత రాబట్టిందంటే!

Master Day 1 Box Office Collections: దక్షిణాది స్టార్ హీరో దళపతి విజ‌య్ న‌టించిన తాజా చిత్రం ‘మాస్టర్’ సంక్రాంతి బరిలోకి దిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన మాస్టర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కరోనా తర్వాత విడుదలైనా భారీ వసూళ్లు సాధిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 14, 2021, 04:12 PM IST
  • దక్షిణాది స్టార్ హీరో దళపతి విజ‌య్ న‌టించిన తాజా చిత్రం ‘మాస్టర్’
  • సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన మాస్టర్ మూవీ
  • విజయ్ నటించిన మాస్టర్ సినిమా తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టింది
Vijay: మాస్టర్ కలెక్షన్ల వర్షం.. తొలిరోజు ఎంత రాబట్టిందంటే!

Master Day 1 Box Office Collections: దక్షిణాది స్టార్ హీరో దళపతి విజ‌య్ న‌టించిన తాజా చిత్రం ‘మాస్టర్’ సంక్రాంతి బరిలోకి దిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన మాస్టర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కరోనా తర్వాత విడుదలైన విజయ్ మూవీ కావడం, అందులోనూ మరో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించడంతో సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

50 శాతం మేర సీట్లకు అనుమతిస్తూ థియేటర్లలో విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలై తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టింది. పవర్‌ఫుల్ విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించడం సినిమాకు హైలైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాస్టర్(Master) మూవీ తొలిరోజు 5.74 కోట్లు రాబట్టింది. కరోనా సమయంలోనూ ఈ మేర వసూళ్లు, అందులోనూ సగం సీట్లకు మాత్రమే అనుమతితో రాబట్టం విశేషమే. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటన సైతం ప్లస్ పాయింట్ అయింది. 

Also Read: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

నైజాం ఏరియాలో రూ.1.49 కోట్లు,
సీడెడ్‌లో రూ.1.1కోట్లు
వైజాగ్‌లో రూ.83 లక్షలు
పశ్చిమ గోదావరిలో రూ.56 లక్షలు
తూర్పు గోదావరిలో రూ.48 లక్షలు
గుంటూరులో రూ67 లక్షలు
నెల్లూరులో రూ.25 లక్షలు
కృష్ణాలో రూ.36 లక్షలు తొలిరోజు వసూలు చేసింది.

 

 

లోకశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్రన్ సంగీతం అందించాడు. హీరో విజయ్(Vijay) సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్‌గా నటించింది. ప్రొఫెసర్‌గా, కాలేజీ విద్యార్థిగా రెండు పాత్రల్లో విజయ్ కనిపించాడు. తమిళం‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదలైంది.

Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x