Jammu kashmir snowfall: ఏ ముహూర్తాన..ఎందుకన్నారో తెలియదు కానీ..సరిగ్గా సరిపోతుంది ఆ పదం జమ్ముకశ్మీర్ కు. నిజంగానే భూతల స్వర్గమిది. కశ్మీర్ అందాలు వర్ణించాలంటే మాటలు సరిపోవు. పదాలకు అందని కమనీయ దృశ్యకావ్యం. తనివితీరని అందాల ధామం. కశ్మీర్ లోయల్లో..నిండుగా కురుస్తున్న భారీ హిమపాతంతో అందాలు మరింతగా ద్విగుణీకృతమవుతున్నాయి. భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. హైవేలపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పర్యాటకులకు మాత్రం ఆనందమే ఆనందం..నదులు, సరస్సులు గడ్డకట్టుకుపోయి సరికొత్త కశ్మీర్ దర్శనమిస్తోంది.