ఇండియన్ రైల్వేస్ ఒక అద్భుతమైన ప్రాజెక్టు గురించి ప్రటకించింది. దానికి సంబంధించిన వివరాలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. Source: Ministry of Railways
The Anji Khad Bridge అనే ఈ బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో తొలి కేబుల్ ఆధారిత బ్రిడ్జ్.. Source: Ministry of Railways
ఈ బ్రిడ్జిని ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్ లింకు ( USBRL) లో నార్తెర్న్ జమ్మూ కశ్మీర్ రైల్వేస్ నిర్మిస్తోంది. ఇది కట్రా నుంచి జమ్మూ కశ్మీర్‌లోని రీసీని కనెక్ట్ చేస్తుంది. Source: Ministry of Railways
ఈ బ్రిడ్జినీ చినాబ్ నదిపై 331 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు సుమారు 473.25 మీటర్లుగా ఉంటుంది.
ఒక్కో బ్రిడ్జ్ పిల్లర్‌ను మొత్తం 96 కేబుల్స్ సపోర్ట్‌గా ఉంటాయి. Source: Ministry of Railways
అంజి ఖాద్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇది ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్చి షేప్ బ్రిడ్జిగా ఖ్యాతి గడించనుంది. Source: Ministry of Railways