ఆధార్ కార్డు ( Aadhar card ) విషయంలో కొన్ని అంశాల్ని అప్డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సాధారణంగా.
ఆధార్ కార్డు ( Aadhar card ) విషయంలో కొన్ని అంశాల్ని అప్డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సాధారణంగా.
ఆథార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ ( UIDAI ) కోట్లాది ఆధార్ ( Aadhar ) యూజర్ల కోసం కీలకమైన ప్రకటన చేసింది. ఇప్పుడిక మీరు ఇంట్లో కూర్చునే ఆధార్ కార్డుకు సంబంధించిన డెమోగ్రఫిక్ అంశాలన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చిరునామా, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాల్ని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు ( Aadhar card ) లో బయోమెట్రిక్ వంటివాటికి ఫోటో మార్చడానికి వంద రూపాయలు ఖర్చవుతుంది. యూఐడీఏఐ ( UIDAI ) మీకు జెండర్ కూడా మార్చుకునే లేదా కరెక్షన్ సౌకర్యం కల్పిస్తుంది. ఇది కూడా ఆధార్ కేంద్రం నుంచే అవుతుంది.
యూఐడీఏఐ ( UIDAI ) ప్రకారం 1.30 బిలియన్ల కంటే ఎక్కువ ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. గత కొన్నేళ్లుగా ఆధార్ కార్డు వినియోగం కూడా పెరిగింది. ప్రజలు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం కూడా ఎక్కువైంది.
మీరు ఊరు మారుతున్నా లేదా ఇళ్లు మారుతున్నా సరే..ఆధార్ కార్డు అప్డేట్ చేయడం చాలా అవసరం. దీనికోసం మీరు మీ సమపీంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు.
ఆధార్ (Aadhar ) లో డాక్యుమెంట్ లేకుండా ఈమెయిల్ ఐడీ ( Emai id ) మార్చడం లేదా చేర్చడం చేయవచ్చు. ఆధార్ సేవా కేంద్రం దీనికోసం 50 రూపాయలు ఫీజు తీసుకుంటుంది. మీరు ఆన్లైన్ Appointment తీసుకుని ఈ పని చేసుకోవచ్చు.
uidai.gov.in/images/AadhaarHandbook2020.pdf లో ఆధార్ హ్యాండ్‌బుక్ పీడీఎఫ్ ఫైల్ ఉంది. ఈ హ్యాండ్‌బుక్‌లో ఆధార్‌లో పేరు మార్పిడి నుంచి మొదలుకుని వివిధ రకాల కరెక్షన్లు కూడా చేసుకునే ప్రక్రియ ఉంది.