Prithvi Shaw Trolls: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తన వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. గత సిరీస్‌లలో దారుణంగా విఫలమైన యువ సంచలన పృథ్వీ షా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే నైట్ టెస్టులోనూ సులువుగా వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఫుట్‌వర్క్ లోపం, నిర్లక్ష్యపు షాట్ ఆడి పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. ఇక అది మొదలుకుని నెటిజన్లు పృథ్వీ షాపై ఫన్నీ మీమ్స్, సెటైర్లతో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Also Read: Air India Offers: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్
Prithvi Shaw Trolls: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తన వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. గత సిరీస్‌లలో దారుణంగా విఫలమైన యువ సంచలన పృథ్వీ షా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే నైట్ టెస్టులోనూ సులువుగా వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఫుట్‌వర్క్ లోపం, నిర్లక్ష్యపు షాట్ ఆడి పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. ఇక అది మొదలుకుని నెటిజన్లు పృథ్వీ షాపై ఫన్నీ మీమ్స్, సెటైర్లతో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
పింక్ బాల్ టెస్టులో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సంధించిన తొలి ఓవర్ రెండో బంతికి షా క్లీన్ బౌల్డ్ అయి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. కవర్స్ దిశగా ఆడేందుకు చూడగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వచ్చి నేరుగా స్టంప్స్‌ను గిరాటేసింది. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్ షా వికెట్‌ను టీమిండియా కోల్పోయింది.
ఈ టెస్టుకు ముందు సైతం షా పేలవఫామ్ కొనసాగిస్తున్నాడు. చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో పృథ్వీ షా చేసిన పరుగులు 0, 0, 7, 10, 9, 0, 0, 19, 40, 3. దీంతో శుభమన్ గిల్‌కు బదులుగా షాను ఎందుకు తీసుకున్నారని సైతం అంతా ప్రశ్నించారు.
అనుకున్నట్లుగానే షా డకౌట్ కావడంతో రవిశాస్త్రిపై, ఓపెనర్ షాపై సెటైర్లు పేలుతున్నాయి. అతడు జూనియర్ సచిన్ కాదు, సెహ్వాగ్ కాదు, లారా కాదు.. డకౌట్లలో మాత్రమే కింగ్ అని నెటిజటన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read: Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా
Also Read: Forbes 2020 Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!