పండగ పర్యావరణం రెండూ కావాలి అనుకునే వారు ఈ దీపావళిని ఎకో ఫ్రెండ్లీ విధానంలో (Eco-Friendly Diwali) సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాతావరణాన్ని కాపాడుకోచ్చు. అయితే ఇలా చేయడానికి మనం రీసైకిల్ చేయదగ్గ వస్తువులను వినియోగించుకోవాలి.
పేపర్ బేగ్ లాంతర్న్ తో ఈ సారి మీ ఇంటిని అలంకరించి ఇకో ఫ్రెండ్లీ విధానంలో దీపావళి సెలబ్రేట్ చేసుకోవచ్చు.
ఈ దీపావళి కి మీరు జామ్ లేదా సాస్ పాత బాటిళ్లను గోల్ట్ పేంటింగ్ చేసి అలంకరించవచ్చు.
పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా దీపావళిని ఇలా మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి సెలబ్రేట్ చేసుకోవచ్చు.
కార్డ్ బోర్డ్ లాంతర్న్ చేయడం చాలా సులువు. దీని కోసం మీకు పాత కార్డ్ బోర్డును వాడవచ్చు. దాన్ని వేరు వేరు ఆకారంలో కట్ చేయాల్సి ఉంటుంది. దానికి రంగులు వేయాల్సి ఉంటుంది.
ఈ దీవాళికి ఫ్లోరల్ లైట్స్ ను మీ సరికొత్త అంశంగా చేర్చి కొత్త అనుభూతిని సొంతం చేసుకోండి. అందంగానూ ఉంటాయి.