Bihar Assembly Election 2020: బిహార్ సీఎం నితీశ్ కుమార్.. 5 ఆసక్తికర విషయాలు తెలుసా!

  • Nov 03, 2020, 12:55 PM IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020 (Bihar Assembly Election 2020) జరుగుతున్న నేపథ్యంలో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Bihar CM Nitish Kumar) సీఎం నితీశ్‌ కుమార్‌కు సవాల్ విసురుతున్న అంశం.. ఏదైనా ఒకచోట ఎన్నికల్లో పోటీచేసి నిరూపించుకోవడం. దీంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరనే విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బిహార్‌లో అభివృద్ధి బాటలు వేసిన ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్‌కు పేరున్నా ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. నిరుద్యోగ సమస్య నితీశ్‌కు తలనొప్పిగా మారింది.

1 /5

నలంద జిల్లాలోని హర్నాట్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి 1977లో నితీశ్‌ కుమార్‌ తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 

2 /5

ఈసారి పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన నితీశ్ కుమార్ 1985లో అదే మర్నాట్ నుంచి బరిలోకి దిగి రికార్డు మెజార్టీతో ఎన్నికల్లో ఘన విజయం సాదించారు.

3 /5

1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నెగ్గిన తర్వాత మరోసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ 1989, 1991, 1996, 1998, 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఆరు పర్యాయాలు నితీశ్ కుమార్ విజయదుందుభి మోగించారు. 

4 /5

గత 35 ఏళ్లుగా శాసనసభ ఎన్నికల్లో వ్యక్తిగతంగా నితీశ్ బరిలోకి దిగలేదు. తొలిసారి 2000లో బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో అసెంబ్లీలో ఏ సభలోనూ ఆయన సభ్యుడు కారు. మెజార్టీ లేకపోవడంతో కేవలం 8 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.

5 /5

ఎమ్మెల్యేగా పోటీ చేయనప్పటికీ.. మొత్తంగా ఆరు పర్యాయాలు సీఎం పీఠాన్ని నితీశ్ కుమార్ అధిరోహించారు. 2000, 2005, 2010, 2015 (రెండు పర్యాయాలు), 2017లలో బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలి నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ నితీశ్ బరిలోకి దిగలేదు