ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కనిష్ట పుత్రుడు నటుడు రాజా వివాహం ఘనంగా జరిగింది.
హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్ల హోటల్లో అక్టోబర్ 31న ఉదయం 10.55 నిమిషాలకు జరిగిన పెళ్లి వేడుకలో వధువు వెంకటలక్ష్మి హిమబిందు మెడలో రాజా చెంబోలు తాళి కట్టాడు.
ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, గుణ్ణం గంగరాజు, క్రిష్, వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవురులని ఆశీర్వదించారు.
అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అంతరిక్షం, హ్యాపీ వెడ్డింగ్, మిస్టర్ మజ్ను, రణరంగం వంటి చిత్రాల్లో నటించిన రాజాకు.. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్‌కి సోదరుడిగా చేసిన పాత్ర మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల భానుమతి రామకృష్ణ మూవీలోనూ రాజా నటించారు.
ఆగస్ట్‌లో రాజా - హిమబిందుల నిశ్చాతార్ధం జరిగింది. కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనలు అమలులో ఉన్నందున చాలా మంది సెలబ్రిటీలను ఈ పెళ్లికి ఆహ్వానించలేదు. అయినప్పటికీ.. వచ్చిన సెలబ్రిటీలతోనే రాజా పెళ్లి మండపం ఎంతో సందడిగా కనిపించింది.
Next Gallery