నిన్నటి వరకూ చైనా..ఇప్పుడు టర్కీ. పాకిస్తాన్ ( Pakistan ) కు అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలబడుతోంది. ముఖ్యంగా ఆ జాబితా నుంచి పాక్ దేశాన్ని తొలగించాలంటూ గట్టిగా వాదిస్తోంది టర్కీ ( Turkey ).
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ( Financial Action Task Force ) ( FATF ) జాబితా అనేది ఆర్ధికంగా వెనుకబడి ఉన్నదేశాలకు కీలకమైనది. వాస్తవానికి ఎఫ్ఏటీఎఫ్ స్థాపన అనేది మనీలాండరింగ్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసినా...9/11 దాడుల ( 9/11 Attacks ) అనంతరం టెర్రర్ ఫండింగ్ ( Terror Funding ) కార్యకలాపాలపై నిఘాకు విస్తరించారు. 2003లో ఎఫ్ఏటీఎఫ్ కొత్త మార్గదర్శకాల్ని ( FATF New Guidelines ) జారీ చేసింది. దీని ప్రకారం అక్రమ నిధుల రవాణా, అనుమానాస్పద నిధుల ప్రవాహంపై నిఘా ఉంచేందుకు వీలుగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేయాలని దేశాల్ని కోరింది.
ఎఫ్ఏటీఎఫ్ ఇందులో గ్రే, బ్లాక్ జాబితా ( Grey and Black lists in FATF ) లుంటాయి. మనీ లాండరింగ్ ( Money laundering ) , టెర్రర్ ఫండింగ్ వ్యవహారాల్లో దేశాల పాత్రను బట్టి, కార్యాచరణను బట్టి గ్రే లేదా బ్లాక్ జాబితాల్లో ఉంచుతారు. ప్రస్తుతం బ్లాక్ జాబితాలో ఉన్నవి ఇరాన్ , నార్త్ కొరియా దేశాలు. బ్లాక్ లిస్ట్ అనేది చాలా సీరియస్ వ్యవహారం. తరువాత దశ గ్రే లిస్ట్. పాకిస్తాన్ ఇప్పుడీ జాబితాలో ఉంది.
అయితే జమ్ముకశ్మీర్ ( jammu kashmir ) విషయంలో పాకిస్తాన్ ( pakistan ) కు తోడుగా నిలిచిన టర్కీ..ఎఫ్ఏటీఎఫ్ విషయంలో కూడా పాక్ కు మద్దతుగా నిలిచింది. నిన్న అంటే అక్టోబర్ 23న జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో సైతం పాకిస్తాన్ ను గ్రే జాబితా ( Pakistan in FATF Grey list ) నుంచి తొలగించాల్సిందిగా టర్కీ వాదించింది. మిగిలిన అన్నిదేశాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిలిచాయి. ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్ (ఐసీఆర్జీ) మీటింగ్‌లో సాంకేతిక కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్ నుంచి తొలగించాలని టర్కీ, చైనా , సౌదీ అరేబియా దేశాలు మాట్లాడినప్పటికి టర్కీ మాత్రమే అందుకు మద్దతుగా నిలిచింది. దీనికి సంబంధించిన సమీక్ష 2021న ప్లీనరీ ( FATF plenary in 2021 February ) లో జరగనుంది. అంటే అప్పటివరకూ పాకిస్తాన్ గ్రే జాబితాలో ఉండాల్సిందే. Also read: US Elections 2020: ట్రంప్‌పై మండిపడ్డ బరాక్ ఒబామా
జమ్ము కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలంగా కశ్మీరీ సోదరసోదరీమణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ గురించి ఈరోజు పాకిస్తాన్ ఎంతగా ఆవేదన చెందుతుందో.. టర్కీ కూడా అంతే బాధపడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై శాంతియుత చర్చలు జరిగితేనే చక్కని పరిష్కారం దొరుకుతుందని.. ఈ విషయంలో పాకిస్తాన్‌కు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఎఫ్ఏటీఎప్ గ్రే లేదా బ్లాక్ జాబితాలో ఉన్నంతవరకూ ఆ దేశాలకు విదేశాల నుంచి ఆర్ధిక సహాయమనేది అందదు. ప్రస్తుతం ఆర్ధికంగా కుదేలైన పాకిస్తాన్ కు విదేశీ సహాయం గ్రే జాబితా కారణంగా అందడం లేదు. Also read: China: ఇండో అమెరికాల మద్య వచ్చేవారమే చర్చలు