Health Benefits Of Turmeric | పసుపుతో మీ ముఖానికి, చర్మానికి ఎన్ని లాభాలో తెలుసా... పసుపు శుభకరం, మంగళకరమైన పదార్థం మాత్రమే కాదు. ఆరోగ్యానికి అవసరమయ్యే పలు ఔషధాలలో పసుపును విరివిగా వినియోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ బయాటిక్ లక్షణాలు మిమ్మల్ని పలు సమస్యల నుంచి దూరం చేస్తాయి. వంట ఇంట్లో నిత్యం అందుబాటులో ఉండే పసుపు వల్ల మీ చర్మానికి (SkinCare Benefits Of Turmeric), ముఖానికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలు తెలుసుకోండి. (Image Credit: thehealthsite)
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం.. తామర, సోరియాసిస్ సహా మరిన్ని చర్మ సమస్యలకు పరిష్కారం చూపడంలో తోడ్పడుతుంది. పలు చర్మ సమస్యల చికిత్సకు సహాయపడే రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. (Image credit: Representational Image)
పసుపు మీ చర్మంలో కొల్లాజెన్, తేమ స్థాయిని సమతౌల్యం చేసేందుకు సహాయపడుతుంది. అదే విధంగా వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలను సైతం చర్మం నుంచి బయటకు పంపిస్తుంది. మహిళలు ప్రాచీనకాలం నుంచి పసుపును వాడటానికి ఇదో కారణమని చెబుతారు. (Image credit: Representational Image)
బయటకు వెళ్లినప్పుడు అతినీల లోహిత కిరణాలు (UV rays) అధికంగా మీ ముఖంపై పడటం వల్ల మీ చర్మం దెబ్బతింటుంది. తరచుగా పసుపును మీ చర్మానికి రాయడం వల్ల ఈ కిరణాల వల్ల ఎదురయ్యే సమస్యను నివారించవచ్చు. పసుపు మీ చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ప్రశాంతతను కలిగిస్తుంది. (Image credit: Representational Image)
మీ చర్మం మెరుస్తూ ఉండాలంటే, మహిళలు కాస్త పసుపును ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇది మీ చర్మంపై మలినాలను తొలగించి మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. (Image credit: Representational Image)
పసుపులో ఉండే కర్కుమిన్ నల్ల మచ్చలు మరియు మొటిమలను కలగజేసే ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో మొటిమలు, మచ్చల సమస్యకు పరిష్కారం దొరికనట్లే. (Image credit: Representational Image)
Next Gallery