ఆసియాలోనే "సెక్సీ గర్ల్" ప్రియాంక చోప్రా

2016లో సంవత్సరంలో ఇదే స్థానాన్ని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే దక్కించుకోవడం గమనార్హం.

Last Updated : Dec 8, 2017, 02:53 PM IST
 ఆసియాలోనే "సెక్సీ గర్ల్" ప్రియాంక చోప్రా

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ఓ అరుదైన గుర్తింపు లభించింది. ఇటీవలే ప్రముఖ లండన్ పత్రిక "ఈస్ట్రన్ ఐ" నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో ప్రియాంక చోప్రా, ప్రపంచ శృంగార వనితల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోనే 50 మంది ఉత్తమ శృంగార వనితల జాబితాలో ప్రియాంక చోప్రా మొదటి స్థానంలో నిలవడం విశేషం. 

2016లో సంవత్సరంలో ఇదే స్థానాన్ని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే దక్కించుకోవడం గమనార్హం. అయితే 2017 సంవత్సరంలో ఇదే జాబితాలో దీపికా పదుకొనే ఆశ్చర్యంగా మూడవ స్థానాన్ని పొందారు. రెండవ స్థానాన్ని టీవి నటి నియా శర్మ పొందగా, నాలుగు, అయిదవ స్థానాలను అలియాభట్, మహిరా ఖాన్ దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా "ఈస్ట్రన్ ఐ" నిర్వాహకులు ప్రియాంక చోప్రాని అందం, తెలివితేటలు, సాహసం, కరుణ కలిగిన పరిపూర్ణమైన స్త్రీగా అభిమానులు పరిగణించబట్టే, ఆమెకు ఈ స్థానం దక్కిందని తెలిపారు. 

Trending News