Malavya Rajyog 2025: మాళవ్య మహారాజ యోగం.. ఈ రాశులవారు ఊహించని డబ్బు పొందబోతున్నారు!

Malavya Rajyog 2025 Effect: జనవరి 28న శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే అనుకున్న పనుల్లో కూడా వీరు విజయాలు సాధిస్తారు.     

Malavya Rajyog 2025 Effect On Zodiac Sign: శుక్ర గ్రహాన్ని శక్తివంతమైన గ్రహంగా కూడా పరిగణిస్తారు. ఈ గ్రహం అప్పుడప్పుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం జనవరి 28వ తేదిన సంచారం చేయబోతోంది. శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించనుంది. అయితే ఈ గ్రహం చాలా అరుదుగా మీన రాశిలోకి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేయడం వల్ల మాళవ్య రాజ యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

1 /5

మాళవ్య మహా రాజ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి చిరకాల కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.     

2 /5

ముఖ్యంగా శుక్రుడి సంచారం వల్ల ధనుస్సు రాశివారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాకుండా పురోగతి సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది.     

3 /5

ఎంతో శక్తివంతమైన మాళవ్య మహా రాజ యోగం ఎఫెక్ట్‌ వల్ల వృషభ రాశి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా గతంలో కోరికలు కూడా నెరవేరుతాయి. శత్రువుపై వీరు విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా నిలుస్తారు. పెండింగ్‌ పనులు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.    

4 /5

మిథున రాశివారు శుక్రుడు సంచారం చేయడం వల్ల వృత్తి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే సహోద్యోగుల సపోర్ట్‌ లభించి.. పనుల్లో పురోగతి కూడా లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.    

5 /5

కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీరికి మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఊహించని డబ్బు పొందుతారు.