Self Employment Small Business Idea: ఎప్పటికి డిమాండ్‌ ఉండే బిజినెస్‌.. పెట్టుబడి చాలా తక్కువ నెలకు రూ. లక్ష ఆదాయం..

Latest Ayurvedic Store Business Idea: నేటి యుగంలో సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే ఆలోచన చాలామందిలో ఉంది. దీనికి కొన్ని కారణం ఉద్యోగంలో ఉన్నప్పుడు లభించే జీతం కంటే బిజినెస్‌లో ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. తమ సొంత ఆలోచనలను, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులు లేదా సేవలను అందించవచ్చు. లేదా  బిజినెస్‌ను విస్తరించి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో చాలామంది ముందుకు సాగుతున్నారు. జినెస్‌ను ప్రారంభించడానికి కొంత మొత్తంలో పెట్టుబడి అవసరం. అయితే మీరు కూడా బిజినెస్‌ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? ఈ బిజినెస్ ఐడియాతో మీ కలను నెరవేర్చుకోండి.

1 /12

 బిజినెస్ ప్రారంభించడం ఇప్పుడు చాలా మంది యువతలో ఒక ట్రెండ్‌గా మారింది.  ఇది కేవలం ఒక ట్రెండ్‌గా కాకుండా జీవన విధానంగా మారుతోంది. ఉద్యోగం చేయడం కంటే స్వయంగా బాస్ అయి, తమ సమయాన్ని, పనిని తాము నిర్ణయించుకోవడం చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటుంది.  

2 /12

దీంతో పాటు ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి టెక్నాలజీల వల్ల వ్యాపారాన్ని ప్రారంభించడం, నిర్వహించడం చాలా సులభమైంది. అయితే మీరు కూడా సొంతంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటే ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌తో మీ లైఫ్‌ సెట్‌ అవుతుంది.   

3 /12

మీరు తెలుసుకొనే బిజినెస్‌ ఆయుర్వేదానికి సంబంధించినది.  ఆయుర్వేదం భారతీయ సంస్కృతిలో నాటుకున్న ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఆరోగ్యంపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆయుర్వేద వ్యాపారం కూడా క్రమంగా విస్తరిస్తోంది.  

4 /12

ఆయుర్వేద వ్యాపారానికి డిమాండ్‌ ఉండడానికి కారణం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం ప్రకృతి దత్త పదార్థాలను ఉపయోగించి సమతుల్య ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తుంది.

5 /12

విదేశీ మందులకు బదులుగా సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల  ప్రజలు ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పశ్చిమ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం ప్రాచుర్యం పొందుతోంది.

6 /12

ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలని అనుకుంటున్నారా? దీని ప్రారంభించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. 

7 /12

మీరు ఏ రకమైన ఆయుర్వేద ఉత్పత్తులు లేదా సేవలను అందించాలనుకుంటున్నారు? మీ లక్ష్య గ్రాహకులు ఎవరు? మీ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పోటీదారులు ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలి. 

8 /12

ఆయుర్వేదం గురించి మీకు మంచి అవగాహన ఉండాలి. మీరు ఆయుర్వేద నిపుణులతో సంప్రదించవచ్చు లేదా ఆయుర్వేద కోర్సులు చేయవచ్చు.  

9 /12

ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి విక్రయించాలంటే, మీకు డ్రగ్ లైసెన్స్ అవసరం. ఈ లైసెన్స్‌ను రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం నుంచి పొందాలి. దీంతో పాటు  మీ వ్యాపారాన్ని చట్టబద్ధంగా నమోదు చేయడానికి వ్యాపార రిజిస్ట్రేషన్ పొందాలి.  మీరు జీఎస్టీ పరిధిలోకి వస్తే, జీఎస్టీ నమోదు చేయించుకోవాలి.

10 /12

 మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఒక స్థలాన్ని అద్దెకు తీసుకోవాలి లేదా కొనుగోలు చేయాలి లేదా చిన్న షాపులో కూడా అమ్మవచ్చు. ఆయుర్వేద ఔషధాలు, ఆరోగ్య పానీయాలు, సౌందర్య సాధనాలు మొదలైన వాటిని కొనుగోలు చేయాలి.  

11 /12

మీ కస్టమర్లకు మంచి సేవలు అందించడం చాలా ముఖ్యం. వారి సందేహాలను నివృత్తి చేయడానికి వారి అభిప్రాయాలను వినడానికి సిద్ధంగా ఉండాలి.  

12 /12

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి మీ ఉత్పత్తులను ప్రచారం చేయవచ్చు. ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. 30,000 నుంచి రూ. 35,000 సంపాదించుకోవచ్చు. మీరు పెద్దగా షాపు పెట్టుకోవాలంటే కనీసం రూ. 4 లక్షలు అవుతుంది.  ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ప్రారంభించండి.