Happy Bhogi Wishes And Forward Messages: సంక్రాంతిని భారతీయులు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ మూడు రోజులపాటు జరుపుకునే పండగలో మొదట జరుపుకునే పండగే భోగి.. ఈ పండగ రోజున అందరూ పిండి వంటలతో భోగిమంటలతో సంతోషంగా ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు మీ మేలుకోరే వారికి పంపండి..
Happy Bhogi Wishes And Forward Messages 2025: సంక్రాంతికి ముందు జరుపుకునే భోగి పండగకి భారతదేశంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రైతులంతా వారి కష్టాలకు తగిన ప్రతిఫలం కలగాలని, పంటలు మంచిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఇంద్రుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ ఇంద్రదేవుని గౌరవార్థంగా చేసుకునే పండగగా భావిస్తారు. ఈరోజు రైతులంతా ఇంద్ర దేవుడిని పూజించి.. కమ్మని వంటకాలను తయారుచేసుకొని తింటూ ఉంటారు. ఈ పండగని వివిధ రాష్ట్ర ప్రజలు వివిధ పేర్లతో పిలుచుకుంటారు.
ముఖ్యంగా పంజాబ్లోని రైతులంతా భోగి పండుగను లోహ్రీ పండగగా పిలుస్తారు. ఇక అస్సాంలోని ప్రజలు అయితే ఈ పండగను మాఘి బిహు పండగగా పిలుస్తారు. ఇలా ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క విధంగా తెలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ భోగి పండుగ రోజున కొన్ని రాష్ట్రాల్లో ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని భోగి మంటలు వేసుకుంటారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకునే క్రమంలో లభించే పాత వస్తువులను తీసి భోగి మంటల్లో కూడా వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రైతులంతా అప్పుడే పొలం నుంచి సేకరించిన బియ్యాన్ని దంపి పాయసం తయారు చేసుకుంటారట.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి..
ఈ భోగి పండుగ ప్రతి రైతు జీవితంలో ఆనందాన్ని, సుఖ సంతోషాలను నింపాలని ఆ ఇంద్రుడిని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి పండుగ రోజున ఇంద్రుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగును నింపాలని.. భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా భోగి పండుగ శుభాకాంక్షలు..
ఈ భోగి పండుగ సందర్భంగా మీలో ఉన్న వ్యాధులన్నీ తొలగిపోయి.. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని.. ప్రతి దేవతను ప్రార్థిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
ప్రతి ఒక్కరూ తరిగిపోని సిరులతో.. ధనధాన్యాలతో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరం పాడిపంటలు, కమ్మనైన పిండి వంటలు, చక్కనైన ఆరోగ్యంతో భోగి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ..మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..