Massive Gold In Sindhu River: బంగారం పేరు వింటేనే..ఎంత తులం పలుకుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. తులం బంగారం కొంటున్నామంటే అమ్మో తులమా అని నోరెళ్లబెట్టేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం లక్షవైపు దూసుకెళ్తుంది. అయితే మనలో చాలా మందికి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడ తయారు చేస్తారో కూడా తెలియదు.
Massive Gold In Sindhu River: బంగారానికి..మహిళలకు మధ్య విడదీయరని బంధం ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు ఫంక్షన్లు ఏదైనా సరే బంగారాన్ని మెడలో వేసుకుని పోవాల్సిందే. బంగారం ధర తులం లక్ష కానీ ..పది లక్షలు కానీ కొనాల్సిందే. అయితే ఈ బంగారం ఎక్కడ దొరకుతుందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎక్కడ తయారు చేస్తారో కూడా తెలియదు.
బంగారం ఆఫ్రికా ప్రాంతంలో గనులు ఉన్నాయి. మన దేశంలో కర్నాటనలో ఉన్నాయి. అయితే ఇప్పుడు పక్క దేశం పాకిస్తాన్ లోనూ బంగారు నిల్వలు బయటపడ్డాయి. అవును తీవ్ర కరువుతోపాటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు బంగారు నిల్వలు ఆశాకిరణంగా మారాయి.
సింధునదిలో బంగారు నిల్వలు ఉన్నట్లు పాకిస్తాన్ జియోలాజికల్ అధికారులు గుర్తించారు. సముద్రంగర్భంలోని విలువైన నిధులు ఉంటాయని మన పురాణాల నుంచి ఆధునిక కాలం వరకు కథలుగా విన్నాం. అయితే పంజాబ్ ప్రావిన్స్ లోని సింధు నధి పరివాహక ప్రాంతంలో ఈమధ్యే వెలుగులోకి వచ్చిన ఒక కథ ఇప్పుడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.
పాకిస్థాన్ జియాలజికల్ సర్వే నిర్వహించిన పరిశోధనల ప్రకారం నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నిల్వలు మొత్తం దాదాపు 32.6 టన్నులుగా ఉన్నాయని తెలిపారు. అంతేకాదు వాటి విలువ దాదాపు రూ. 18 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సమాచారం బయటికి రావడంతో దేశవ్యాప్తంగా బంగారు నదిగా అభివర్ణిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. పెరిగిన ఇంధనం ధరలు, నిత్యవసర ధరలు సామాన్యుడు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ సింధూ నదిలో బంగారం నిధులు ఉండడం వల్ల కాస్త ఊరట కలిగిస్తుంది. సింధూ నది నుంచి బంగారు నిధులు వెతికి తీయడం దేశ ఆర్థిక స్థితిగతులను మార్చే చక్కటి పరిష్కారంగా కనిపిస్తోంది.
బంగారం నిల్వలు ఆర్ధిక భారాన్ని మరింత తగ్గించి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్టం చేసే ఛాన్స్ ఉంది. ఇంధన, నిత్యవసర ధరలు తగ్గడం ద్వారా సామాన్యులకు ఊరట లభించవచ్చు . పంజాబ్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్లు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ నిలిపివేస్తామని ప్రభుత్వమే నిబంధనల ప్రకారం గనుల నిర్వహణ చేయబడుతుందని ఆయన వెల్లడించారు.
సింధూ నది జలాలు పాకిస్తాన్ భూభాగం కూడా ప్రవహిస్తూ వందల యేళ్ల కాలంలో కదలికల కారణంగా బంగారు కణాలు నదిలోయలో చేరవేసినట్లు కథల్లో వింటున్నాం. ఇది మైనింగ్ ద్వారా వెలికి తీయనున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని ఆర్థిక భవిష్యత్తును మరింత మార్చే అవకాశం ఉంది. ప్రజల పండుగలా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియ కార్యరూపంలోకి రావడం దశాబ్దం కలా అని విశ్లేషకులు భావిస్తున్నారు.