Redmi K80 Ultra Price: అబ్బా ఈ మొబైల్‌ భలే ఉంది.. Redmi K80 అల్ట్రా ఫోన్ చూస్తే పక్కా కొంటారు!

Redmi K80 Ultra Price: అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో Redmi K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనికి సంబంధించిన లాంచింగ్‌ వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

Redmi K80 Ultra Price And Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమీ (Xiaomi) తమ కస్టమర్స్‌కి త్వరలోనే గుడ్‌న్యూస్‌ అందించబోతోంది. అతి త్వరలోనే  Redmi K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. రెడ్‌మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే విడుదలలో కాస్త జాప్యం జరిగింది. అయితే ఇటీవలే ఈ మొబైల్‌ డిజైన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 

1 /5

ఈ Redmi K80 సిరీస్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాల్లోకి వెళితే.. ఈ సిరీస్‌లో  Redmi K80 Ultra స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్‌ MediaTek Dimensity 9400+ చిప్‌సెటప్‌లో విడుదల కాబోతోంది. అలాగే దీని ఫ్రంట్‌ భాగంలో ప్రత్యేకమైన స్క్రీన్‌  సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.  

2 /5

ఇందులోని స్క్రీన్‌ ప్రత్యేకమైన బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 1.5K పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన డిజైన్‌ సెటప్‌లో విడుదల కాబోతోంది.     

3 /5

ఈ Redmi K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు ఇటీవలే లీక్‌ అయిన వివరాల్లో వెల్లడించారు. ఈ మొబైల్‌ అద్భుతంగా కనిపించేందుకు మెటల్ ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన స్మూత్‌ టచ్ డిస్ల్పేతో విడుదల కానుంది.x  

4 /5

ఈ స్మార్ట్‌ఫోన్ టోటల్ IP68 డస్ట్‌తో పాటు వాటర్‌ రెసిస్టెన్స్‌తో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ధర వివరాలు ఇప్పటికీ కంపెనీ ప్రకటించలేదు. అయితే దీనిని అతి తక్కువ ధరలోనే విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.     

5 /5

ఇక ఈ Redmi K80 అల్ట్రా మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది 6500mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన  సిలికాన్-కార్బన్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అలాగే ప్రత్యేకమైన ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.