Kuja Gochar 2025: మిథునరాశిలో కుజ సంచారం.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. డబ్బే డబ్బు..

Kuja Gochar 2025: గ్రహా మండలంలో కొన్ని గ్రహాల కలయికను అరుదైన యోగంగా భావిస్తారు. కుజుడు .. ఈ నెల 21 మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. కుజుడు నవగ్రహాల్లో సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

 

1 /6

కుజుడు రాశి మార్పు 12 రాశుల ను ప్రభావితం చేస్తోంది.  కానీ కొన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి మార్పుతో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి.

2 /6

మకర రాశి.. కుజుడు మిథున రాశిలో ప్రవేశం వలన మకర రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలతో మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఆకస్మిక ధనలాభం అందుకుంటారు. సంపదలో పెరుగుదల ఉంటుంది.  

3 /6

కుంభ రాశి.. కుజుడు మిథునంలో ప్రవేశం వలన కుంభ రాశి వారికి మంచి ఫలితాలను అందించబోతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభంతో ఐశ్వర్య వంతులు అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగ, విద్యకు సంబంధించిన పనులలో లాభాలనుఅందుకుంటారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

4 /6

మేష రాశి.. కుజుడు మిథున రాశిలో ప్రవేశం వలన మేష రాశి వారికి అనుకోని లాభాలు కలగనున్నాయి.  చేసే పనిలో విజయం సాధిస్తారు.  మీరు మీ మాటలను అదుపులో ఉంచుకుంటే జీవితంలో పైకొస్తారు. వ్యక్తిగత జీవిత సమస్యలు దూరమవుతాయి.  

5 /6

తులా రాశి.. కుజుడు మిథున రాశిలో తులా రాశి వలన అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులు తమ కార్యాలయంలో చేసే పనికి తగిన గుర్తింపు పొందుతారు. మొత్తంగా ఈ కాలం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడికి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. 

6 /6

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్, జ్యోతిష్యులు చెప్పిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.