Yuzvendra Chahal: కొత్త ఏడాదిలో ఫస్ట్ షాకింగ్ న్యూస్.. భార్యకు చాహల్ బిగ్ ట్విస్ట్..!

Yuzvendra Chahal Dhanashree Verma Divorce: కొత్త ఏడాదిలో క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసే వార్త వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోగా.. చాహల్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భార్య ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో విడాకుల వార్తకు మరింత బలం చేకూరింది.
 

1 /7

సోషల్ మీడియాలో చాహల్-ధనశ్రీ జంటకు భారీ క్రేజ్ ఉంది. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ.. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఉన్న సమయంలో చాహల్ ఇచ్చిన సపోర్ట్‌ అందరికీ తెలిసిందే.   

2 /7

ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన చూడముచ్చటగా ఉండేది. తన స్పిన్‌ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే చాహల్.. వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉంటాడు.   

3 /7

గతంలోనే ఈ జంట విడాకులు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీ తన పేరు నుంచి 'చాహల్'ని తొలగించగా.. చాహల్ కూడా "న్యూ లైఫ్ లోడ్ అవుతోంది" అని అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో  విడాకుల పుకార్లు వ్యాపించాయి.   

4 /7

అప్పుడు చాహల్ విడాకుల పుకార్లను కొట్టిపారేశాడు. ధనశ్రీతో తాను విడిపోవట్లేదని.. ఇలాంటి ప్రచారం నమ్మొద్దని అభిమానులను కోరాడు.  

5 /7

అయితే తాజాగా ఈ జంట విడిపోవడం ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు. విడాకుల పుకార్లు నిజమేనని..  అధికారికంగా రావడానికి మరికొంత సమయం పడుతందని అంటున్నారు. వారు విడిపోవడానికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు.   

6 /7

యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ  డిసెంబర్ 11, 2020న ప్రేమ వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో మ్యాచ్‌లు లేకపోవడంతో సోషల్ మీడియాలో చాహల్ ఎక్కువ సమయం గడిపేవాడు.  

7 /7

అప్పుడు ధనశ్రీ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో చూసి.. తాను కూడా డ్యాన్స్‌ నేర్చుకోవాలని ఆమెను సంప్రదించాడు. ఈ క్రమంలోనే ధనశ్రీతో ప్రేమలో పడిన చాహల్ ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వస్తుండడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.