/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

న్యూజిలాండ్ (India vs New Zealand) పర్యటనను ఘనంగా ప్రారంభించిన టీమిండియా ముగింపు మాత్రం దారుణ వైఫల్యాన్ని మూటకట్టుకుంది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ భారత జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారత్‌కు మరో వైట్ వాష్ తప్పలేదు. టెస్ట్ సిరీస్‌‌ను 2–0తో ఆతిథ్య న్యూజిలాండ్ సాధించింది. కాగా అంతకుముందు వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ విరాట్ కోహ్లీ సేన 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడటం తెలిసిందే. వన్డే సిరీస్‌ను 5-0తో వైట్ వాష్ చేసిన భారత్, ట్వంటీ20, టెస్ట్ సిరీస్‌లలో వైట్ వాష్‌కు గురైంది. అయితే టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి.

Also Read: ధోనీ 0-2, కోహ్లీ 0-3.. భారత్ వైఫల్యాల పరంపర!

1. బ్యాటింగ్ విఫలమైంది
పటిష్ట బ్యాటింగ్‌కు పేరున్న టీమిండియా ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఒక కారణం. గత కొన్ని మ్యాచ్‌లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం భారత్ కొంప ముంచింది. కోహ్లీ రెండు టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌లోనూ 20 పరుగులకు మించి స్కోరు చేయలేకపోయాడు. కీలక సమయాల్లో రాణించే చతేశ్వర్ పూజారా, అజింక్య రహానే స్థాయికి తగ్గట్లు ఆడలేదు. సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ జట్టులో చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేదు.

See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా? 

2. భారత బౌలింగ్‌లో ఖచ్చితత్వం లేకపోవడం
సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌తో పోల్చితే బౌలర్లు పరవాలేనిపించారు. అయితే న్యూజిలాండ్ బౌలర్ల మాదిరిగా కచ్చితమైన బంతులు సంధించలేక పోవడం మైనస్ పాయింట్. క్రైస్ట్‌చర్చ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనింగ్ జోడిని భారత బౌలర్లు త్వరగా ఔట్ చేయడంతో విఫలమయ్యారు. కానీ కివీస్ బౌలర్లు 124 పరుగులకే భారత్‌ను ఆలౌట్ చేశారు.

3. టైలాండర్లు రాణించడం
రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ టాప్, మిడిలార్డర్‌ను ఔట్ చేయడంతో విజయం సాధించినా.. కివీస్ టెయిలెండర్లను ఔట్ చేయడంతో భారత బౌలర్లు విఫలం. ముఖ్యంగా కైల్ జేమిసన్ రెండు మ్యాచ్‌లలో 40 పైగా స్కోరు చేయగలిగాడు. దాంతో భారీ భాగస్వామ్యాలను కివీస్‌కు అందించడం భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది.

Also Read: 17ఏళ్లుగా నిరీక్షణ.. భారత్‌పై కివీస్‌దే ఆధిపత్యం

4. టాస్ కోల్పోవడం
గత కొన్ని సిరీస్‌లలో విరాట్ కోహ్లీని కలవరపాటుకు గురి చేసిన అంశం టాస్. కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడటం, కివీస్ తమకు అనుకూలించే విధంగా టాస్ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం భారత టాపార్డర్‌కు ఇబ్బందికరంగా మారింది. టాస్ నెగ్గితే ఆదిలోనే కివీస్‌ను దెబ్బకొట్టి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. 

5. బాధ్యత, అనుభవం లేని బ్యాటింగ్
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లాంటి మేటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడం టీమిండియా లయను దెబ్బ తీసింది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా రెండుసార్లు మంచి ఇన్నింగ్స్ ఆడినా భారీ స్కోరు మలచడంతో విఫలమయ్యారు. అనుభవలేమి కారణంగా భాగస్వామ్యాల దిశగా వారు ఆలోచించలేదు. అనుభవం ఉన్న ఆటగాళ్లు అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా బాధ్యతారహిత షాట్లు కొంపముంచాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమి టీ20 సిరీస్, టెస్టు సిరీస్ వైట్ వాష్‌లకు ఓ కారణమైంది.

See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
IND vs NZ here is the 5 reasons for Team India series defeat to new zealand
News Source: 
Home Title: 

టీమిండియా వైట్ వాష్‌కు కారణాలివే!

టీమిండియా వైట్ వాష్‌కు కారణాలివే!
Caption: 
Photo Courtesy: ANI
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
టీమిండియా వైట్ వాష్‌కు కారణాలివే!
Publish Later: 
No
Publish At: 
Monday, March 2, 2020 - 12:40